Tillu Square Movie OTT Streaming Details:'డీజే టిల్లు' క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. రాధిక రాధిక అంటూ సిద్దు చేసిన రచ్చ మామూలుగా లేదు. రెండేళ్ల క్రితం విడుదలై ఈ మూవీ స్వాగ్‌ ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. రాధిక పేరు వినబడితే చాలు వెంటనే టిల్లును గుర్తు చేస్తుకుంటున్నారు అంతగా సెన్సేషన్‌ అయినా ఈ మూవీకి వచ్చిన స్వీకెల్‌ (Tillu Square OTT) కూడా అంతకు మించి రెస్పాన్స్‌ అందుకుంది. 'టిల్లు స్క్వేర్‌'తో మార్చి 29న విడుదలైన ఈ మూవీ సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. జస్ట్‌ 9 రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది.  ఫస్ట్‌ వీక్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన ఈ మూవీ రూ. 100కు కోట్లకు పైగా వసూళ్లు చేసి నిర్మాతలకు భారీ ఫ్రాఫిట్స్‌ తెచ్చిపెట్టింది.


Tillu Square OTT Update: ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. టిల్లు స్క్వేర్‌ ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెలలోనే స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌ ఫ్లాన్‌ చేస్తుందట. నెల రోజుల ముందే అంటే ఏప్రిల్‌ 26న ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. కాగా ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నిర్మాత సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టిల్లు స్క్వేర్‌ పాటలకు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సింగీతం అందించగా భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ స్కోర్‌ అందించారు.


కాగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ రొమాన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సిద్ధు పంచ్‌ డైలాగ్స్‌, డైలాగ్‌ డెలివరికి యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యింది. ప్రతి సీన్‌లో తనదైన పంచ్‌లు, కామెడీతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. మొత్తానికి డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్‌ను వన్‌ మ్యాన్‌ షోలా ముందుకు నడిపించాడు. ఇందులో సిద్ధు మ్యానరిజంకు అమ్మాయిలు మాత్రం ఫిదా అయ్యారు. అలా అన్ని వర్గాల ఆడియన్స్‌ ఆకట్టుకున్న టిల్లు స్వ్కేర్‌ కోసం ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టి మూవీని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేశారు. మొదటి నుంచి టిల్లు స్క్వేర్‌కు మంచి క్రేజ్ ఉండటంతో ఫ్యాన్సీ ధరకు ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడైనట్టు సమాచారం. తెలుగులో రిలీజైన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తుందట. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లోనూ డబ్బింగ్‌ వెర్షన్‌తో 'టిల్లు స్క్వేర్‌'ను అందుబాటులోకి తీసుకురానుందని టాక్‌.



Also Read: Brahmamudi Serial Today April 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బాబు తల్లి వెన్నెల కాదు, ఆనందంలో కావ్య