Rajinikanth Kamal Haasan Movie : రజనీ కాంత్ కమల్ హాసన్ మూవీ - బిగ్గెస్ట్ ప్రాజెక్టుకు సూపర్ హిట్ కాంబో ఫిక్స్
Thalaivar 174 Movie : కోలీవుడ్ బిగ్గెస్ట్ కాంబో రజనీ కాంత్, కమల్ హాసన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనుండగా ప్రోమో రిలీజ్ కానుంది.

Nelson Dilipkumar Anirudh For Rajinikanth Kamal Haasan Thalaivar 174 Movie : ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ చూపు మొత్తం ఒకే అప్డేట్‌పై ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మూవీ 'Thalaivar174' నుంచి ప్రోమో రిలీజ్ కానుంది.
సూపర్ హిట్ కాంబో రిపీట్
ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కాంబోగా పేరొందిన ఈ పెయిర్ మరోసారి బిగ్గెస్ట్ మూవీ కోసం జత కట్టబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. 'వన్ ఫర్ ది మ్యాజిక్... వన్ ఫర్ ది విన్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
One for the Magic. One for the Win.
— Red Giant Movies (@RedGiantMovies_) February 20, 2026
Together to make #KHxRK unforgettable!@Nelsondilpkumar 🤝 @anirudhofficial #RedGiant17 ✨ pic.twitter.com/nxWfdkEoV3
Also Read : ఎవరూ ఊహించని రోల్‌లో రష్మిక! - బాలీవుడ్ మీడియా వార్తల్లో నిజమెంత?
46 ఏళ్ల తర్వాత...
దాదాపు 46 ఏళ్ల తర్వాత కమల్, రజనీకాంత్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 'కొందరు రూల్స్ సెట్ చేస్తే... కొందరు మాత్రమే పాలిస్తారు' అంటూ అనౌన్స్‌మెంట్‌కే బిగ్ ఎలివేషన్ ఇవ్వడంతో ఏ జానర్ అయ్యి ఉంటుందా? అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ ఇండస్ట్రీకి అందించిన ఇద్దరు దిగ్గజ నటులు కమల్, రజనీ మళ్లీ స్క్రీన్ చేసుకోబోతుండడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. అప్పట్లో దాదాపు 21 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక రజనీ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో రజనీతో మూవీ చేయబోతున్నారు. అయితే, ఇందులో కమల్ హాసన్ నటించడం లేదు. ప్రస్తుతం 'జైలర్ 2'తో రజనీ బిజీగా ఉండగా... ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
























