అన్వేషించండి

Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?

India's Biggest Director SS Rajamouli తీస్తున్న వారణాసిపై రెండు రోజులుగా నెగటివ్ కాంపెయిన్ రన్ అవుతోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ ఒకేలా ఉండటంతో కావాలని చేయిస్తున్నారన్న అనుమానాలున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాజమౌళి-మహేష్ బాబుల 'వారణాసి' చిత్రంపై ప్రతికూల ప్రచారం మొదలైంది.
  • బడ్జెట్ అంచనాలు దాటిందని, OTT డీల్స్ కుదరడం లేదని వార్తలు.
  • అయితే ₹600 కోట్ల OTT డీల్ నెట్‌ఫ్లిక్స్ తో లాక్ అయిందని సమాచారం.
  • సౌత్ సినిమాల ఎదుగుదలను తట్టుకోలేక ఈ పుకార్లు వ్యాప్తి.

 Varanasi Negative Campaign: : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు.  అత్యంత భారీ బడ్జెట్‌తో (సుమారుగా ₹1,400 కోట్లు) తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇండియన్‌ సినిమాను గ్లోబల్ స్టేజ్‌ మీదకు తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారన్నట్లుగా ఈ మూవీపై ప్రచారాలున్నాయి. వచ్చే ఏప్రిల్‌లో మూవీ విడుదలకు కూడా రెడీ అవుతోంది. అయితే విడుదలకు కొన్ని నెలలు ఉండగా... ఈ మూవీపై అకస్మాత్తుగా నెగటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. 

వారణాసి చుట్టూ అల్లుతున్న కథలివే.. 

ఇప్పటికే వారణాసి షూటింగ్ ను చాలా వరకూ పూర్తి చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్ ర్యాపప్ చేసి ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌పైనే దృష్టి పెట్టనున్నారన్నది టాక్. అయితే  ఉన్నట్లుండి...ఈ సినిమాపై కొన్ని నెగెటివ్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ బౌండరీలు దాటేసిందని, ఓటీటీ డీల్స్  అనుకున్నట్లు అవ్వక మేకర్స్ తిప్పలు పడుతున్నారని కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్  ప్రచారం చేస్తున్నాయి. దానికి అవకాశం ఎంతవరకూ ఉందన్న దానిపై  ఆన్‌లైన్‌లో పెద్ద డిబేట్ నడిపిస్తున్నారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఈ రూమర్స్ వెనుక ఉన్నదెవరు? సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం!

OTT పోయింది.. బడ్జెట్‌ బౌండరీలు దాటింది...

ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, కొన్ని నార్త్ మీడియా సర్కిల్స్‌లోనూ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్న వార్త ఇదే. ఈ సినిమాను రాజమౌళి అండ్ టీమ్ 1400కోట్ల లోపు ఫినిష్ చేయాలనుకున్నారు. అయితే ఆ బడ్జెట్ ఇప్పటికే అయిపోయిందని అనుకున్న దానికంటే భారీగా ఖర్చవుతోందని మేకర్స్ ఆందోళనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇంకా అంటార్కిటికా వంటి లోకేషన్లలో షూటింగ్, భారీ VFX పెండింగ్‌లో ఉన్నాయి. పైగా ప్రీ రిలీజ్‌కు క్యాంపెయిన్‌కు భారీగా ఖర్చు చేయాల్సి ఉంది. అందువల్ల ఈ సినిమా బడ్జెట్ అంచనాలను దాటిపోతోందని వాళ్లు ప్రచారం చేస్తున్నారు.

OTTపై భారీ అంచనాలతో సినిమా బడ్జెట్‌ను లెక్కలు వేశారని.. ఇప్పుడు అది తలకిందులైందన్నది వాళ్లు చేస్తున్న ప్రాపగాండా.. ఇంతవరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకు లేనంతగా  దాదాపు 500కోట్లకు పైగానే OTT డీల్స్ సెట్ అయ్యాయని చాన్నాళ్ల క్రితమే జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు అది అంత  రావడం లేదని.. 200-250కోట్లకు మించి ఇచ్చేందుకు OTTలు సిద్ధంగా లేవని చెబుతున్నారు. ఈ లోటు సినిమాపై చాలా ప్రభావం చూపనుందని వాళ్ల అంచనా.. 

 

రాజమౌళి కూడా కాపాడలేడా..?

సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో రాజమౌళి తన రెమ్యనరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధమయ్యారని.. అయితే రాజమౌళి ఎక్కువుగా ప్రాఫిట్ షేర్ మోడల్‌లో వర్క్ చేస్తారు కనుక ఆయన పారితోషికం తగ్గించుకున్నా పెద్దగా ఉపయోగం లేదని వాళ్లే చెబుతున్నారు. అందుకే మూవీ మేకర్స్ సినిమా బడ్డెట్ పరిమితులు దాటకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. మూవీ షెడ్యూల్ టైమ్‌లను కుదించడంతో పాటు.. ఇంటర్నేషనల్ లొకేషన్‌లు తగ్గిస్తారన్నట్లుగా ప్రచారం సాగుతోంది. లేకపోతే సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమవుతుందని ప్రొడ్యూసర్స్‌ ఆందోళనలో ఉన్నారని కూడా చెబుతున్నారు

వాస్తవముందా..? సోషల్ మీడియాలో కౌంటర్-

రెండు రోజులుగా జరుగుతున్న ఈ నెగటివ్‌ క్యాంపెయిన్ చూస్తే.. ఇందులో వాస్తవం ఉన్నట్లుగా అనిపించదు. ఎందుకంటే రాజమౌళి కాంబినేషన్‌కు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అసలు బడ్జెట్ అనేది పెద్ద సమస్య కానేకాదు. ఈ సినిమాకు రాజమౌళి కూడా ఓ ప్రొడ్యూసరే. అలాగే మిగిలిన ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ మూవీ గురించి మాట్లాడలేదు. అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది ఇంతవరకూ ప్రొడ్యూసర్లు అధికారికంగా చెప్పలేదు. OTT డీల్స్ వెనక్కు వెళ్తున్నాయన్న సూచనలు కూడా ఎప్పుడూ రాలేదు.  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం దాదాపు ₹600 కోట్ల కోట్ల భారీ ఆఫర్‌ను లాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్. అలాంటప్పుడు ఓటీటీ డీల్స్ లేవు అనడం కేవలం అపోహ మాత్రమే. జక్కన్న ఎప్పుడూ ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోరు. ఆయన సినిమా లాభాల్లో వాటా (Profit-Sharing Model) తీసుకుంటారు. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎక్కడ రికవరీ చేయాలో రాజమౌళికి ఉన్న ప్లానింగ్ మరెవరికీ ఉండదు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలే దీనికి నిదర్శనం.

 

 అసలు ఎవరు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు?

సోషల్ మీడియాలో, కొన్ని మీడియా హౌస్‌లలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని వారణాసి, SSR, మహేష్‌బాబు ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. నార్త్ మీడియా & కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్.. సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాలు గ్లోబల్ లెవెల్లో అంతంత బడ్జెట్లతో దూసుకుపోతుంటే తట్టుకోలేక, బాలీవుడ్‌లోని కొన్ని సెక్షన్లు కావాలనే నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాయనేది టాలీవుడ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. 

ఈ సిచ్యువేషన్‌ను అవకాశంగా తీసుకుని టాలీవుడ్‌లోనే ఉన్న కొన్ని రైవల్ ఫ్యాన్ బేస్‌లు, సినిమాపై హైప్ తగ్గించడానికి ఇలాంటి బడ్జెట్ ఇష్యూస్ అంటూ  ఈ  వార్తలను ట్రెండ్ చేస్తున్నాయి.

రాజమౌళి పదేళ్ళుగా ఏటికి కాదు.. సముద్రానికే ఎదురీదుతున్నారు. ఇండస్ట్రీ పరిధిలను దాటి చూపించి కొత్త బెంచ్‌ మార్కులు సృష్టించారు. అసలు తెలుగు సినిమా ఊహించని బడ్జెట్‌ను పెట్టి సినిమాలు తీసి.. వాటిని సక్సెస్ చేశారు. RRR ను గ్లోబల్ స్టేజ్‌కు తీసుకెళ్లి... ఆస్కార్ కొట్టి.. పీక్ స్టేజ్ లో ఉన్నారు. అసలు ఇది తేలిగ్గా తీసిపారేసే తెలుగు సినిమా కాదు.. ఒక గ్లోబల్ బ్రాండ్. మహేష్,  ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్‌తో, ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సినిమాపై వస్తున్న ఇలాంటి రూమర్లను రాజమౌళి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇంతకు ముందు అందరి అంచనాలను తలకిందులు చేసినట్లుగానే తన సినిమాతోనే ఇలాంటి వాటికి ఆన్సర్ చేస్తారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget