నయనతార గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. భిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘జవాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.


ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార


తాజాగా నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను ఆమె షేర్ చేసింది. హీరోయిన్ గా లక్షలాది మంది అభిమానులు ఉన్నా, ఆమె ఇప్పటి వరకు ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నిభర్త విఘ్నేష్ శివన్ ఇన్ స్టా అకౌంట్ ద్వారానే షేర్ చేస్తుంది. అయితే, తాజాగా ఆమె ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి, తొలి వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు తమ అభిమాన నటి ఇన్ స్టాలోకి రావడంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే లన్నరకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.


ఇక గతేడాది జూన్ 9న డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొంతకాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు చివరికి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి దగ్గరి బంధువులు, కొద్ది మంది ఇండస్ట్రీ మిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు నయనతార దంపతులు ప్రకటించారు. సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. వీరికి ఉయిర్, ఉలగం అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల పాటు పిల్లల ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తల్లిందండ్రులు. ప్రస్తుతం మామూలుగానే వారి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక నయతార తాజా వీడియోలో పిల్లల ఇద్దరు ముఖాలు స్పష్టంగా కనిపించాయి. నయనతార సూట్ లో గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించింది.  పిల్లలు కూడా కళ్లజోడు పెట్టుకుని క్యూట్ గా కనిపించారు.






విడుదలకు రెడీ అవుతున్న ‘జవాన్’ చిత్రం


ఇక పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై నయనతార ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న ‘జవాన్‌’ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. మూవీ ట్రైలర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో దుమ్మురేపింది. పలు రకాల గెటప్పుల్లో షారుఖ్ ను చూసి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దుమ్ము దులిపేలా’, ‘ఛలోనా’ అనే పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘పఠాన్‘ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అభిమానులో భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


Read Also: 16 ఏళ్లుగా మాటల్లేవు - షారుఖ్, సన్నీ డియోల్ మధ్య గొడవేంటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial