'కేజీఎఫ్' తర్వాత రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash)కు పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోయిన్లలోనూ పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్, రికగ్నైజేషన్ ఉన్న స్టార్ నయనతార. వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఇప్పుడీ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
గంగ పాత్రలో నయన్...ఫుల్ మోడ్రన్ లుక్కులో!'టాక్సిక్' సినిమా నుంచి ఇప్పటికే బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి లుక్స్ వచ్చాయి. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'టాక్సిక్' సినిమాలో గంగ పాత్రలో నయనతార నటిస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఆ పేరు సంప్రదాయబద్ధంగా ఉంది కదూ! అయితే... పేరుకు భిన్నంగా ఆధునికమైన వస్త్రధారణలో నయనతార కనిపించారు. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
మార్చి 19న 'టాక్సిక్' రిలీజ్!Toxic Release Date 2026: 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' కథను యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి రాశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జాతీయ పురస్కార గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా... రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్: టీపీ అబీద్, యాక్షన్: హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్) - నేషనల్ అవార్డు విన్నర్ అన్బరివ్.
Also Read: ప్రభాస్ 'రాజా సాబ్' కాదు... జనవరి 2026లో ఈ హాలీవుడ్ సినిమాలూ థియేటర్లలోకి వస్తున్నాయ్