రీసెంట్ గా నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసింది. ఈ డాక్యుమెంటరీ తమిళ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ అయిన నయనతార, ధనుష్ మధ్య వివాదానికి తెర తీసింది. ఈ వివాదంపై ఇటు నయనతార, అటు ధనుష్ లీగల్ గా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా నయనతార ధనుష్ తో వివాదంపై స్పందించింది.
ధనుష్ వివాదంపై నయన్ ఫస్ట్ రియాక్షన్
తాజా ఇంటర్వ్యూలో నయనతార ధనుష్ తో వివాదంపై మౌనం వీడి, తను అంత స్ట్రాంగ్ గా ఎందుకు రియాక్ట్ కావలసి వచ్చిందో వివరించింది. అంతేకాకుండా డాక్యుమెంటరీ కంటెంట్ వెనక తన టీంకు ఉన్న ఉద్దేశాలని కూడా ఈ బ్యూటీ సమర్ధించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ఈ వివాదం గురించి స్పందిస్తూ "ధైర్యం మన దగ్గర నిజమున్నప్పుడు మాత్రమే వస్తుంది. నేను ఏదైనా కల్పించి చేస్తున్నప్పుడు భయపడాలి. అలా చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే పరిస్థితులు చేయి దాటిన తర్వాత మళ్లీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికీ ఉంటుందని నేను అనుకోను. నాకు సరైనది అని అనిపించిన పని చేయడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఒకరి ప్రతిష్టను దిగజార్చాలని కోరుకునే వ్యక్తిని కాదు నేను" అంటూ చెప్పుకొచ్చింది నయనతార.
ఇక తన బహిరంగ లేఖ డాక్యుమెంటరీ పబ్లిసిటీ స్టంట్ గా ఉపయోగపడదని, ఈ సందర్భంగా నయనతార స్పష్టం చేసింది. నయన్ మాట్లాడుతూ "నయనతార : బియాండ్ ది టేల్ అనేది సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి కాదు. వ్యక్తిగత స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం మాత్రమే. మేము ధనుష్ ను రైట్స్ గురించి అడగడానికి చాలా ట్రై చేశాము. కానీ వర్కౌట్ కాలేదు. నా వ్యక్తిగత ప్రయాణాన్ని వివరించే ఈ డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమా నుంచి కేవలం కొన్ని సీన్స్ ను మాత్రమే ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఇస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఇవ్వలేదు కాబట్టి సినిమాలోని సన్నివేశాలు కాకుండా విగ్నేష్ కు సంబంధించిన కొన్ని బియాండ్ సీన్స్ మాత్రమే తీసుకున్నాము. ఎన్ఓసీ ఇవ్వకపోయినా పర్లేదు. కనీసం అసలు ఇష్యూ ఏంటో తెలుసుకుందాం అని ధనుష్ మేనేజర్ తో కూడా మాట్లాడాను. బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం అని ట్రై చేశాను. కానీ అది కూడా కుదరలేదు. ఈ డాక్యుమెంటరీ మా జీవితం, మా ప్రేమ, మా పిల్లలకు సంబంధించినది. ఇలాంటి ఒక పాపులర్ యాక్టర్ ఇలా చేస్తాడని ఊహించలేదు. మేము సినిమాలోని పాటలు, సీన్స్ ఏమీ ఉపయోగించలేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోరు అనుకున్నాను. కానీ ఆయన ఇలా వ్యవహరించడం అన్యాయం అన్పించింది" అంటూ ఆ సినిమాతో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని వివరించింది.
Also Read: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
అసలు వివాదం ఏంటంటే?
నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా 'నేనూ రౌడీనే'. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి హీరోగా కన్పించారు. ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై 2015లో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా టైమ్ లోనే నయనతార, విగ్నేష్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకుంటానని నయనతార ధనుష్ ను రిక్వెస్ట్ చేసిందట. కానీ ఆయన రెస్పాండ్ కాకపోవడంతో సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను యాడ్ చేసి, నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఆ సీన్స్ ను తొలగించాలని, లేదంటే 7 కోట్లు చెల్లించాలి అంటూ నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. అక్కడే ముదిరింది వివాదం. నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక సుధీర్ఘమైన నోట్ ను రిలీజ్ చేస్తూ ధనుష్ పై విరుచుకుపడింది. ఆ తరువాత కూడా ధనుష్ తగ్గకపోవడంతో ఇద్దరూ లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. ఇదిలా ఉండగా... నయనతార డాక్యుమెంటరీ 'నయనతార ; బియాండ్ ది ఫెయిరీ టేల్' 2024 నవంబర్ 18న నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయింది.
Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!