Anaganaga Oka Raju Promo: జ్యువెలరీ యాడ్ కాదు... 'అనగనగా ఒక రాజు' ప్రోమో - నవీన్ పోలిశెట్టి కామెడీ మూవీ వెరైటీగా...
Anaganaga Oka Raju: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు' నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. జ్యువెలరీ యాడ్ స్పూఫ్‌తో వెరైటీగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

Naveen Polishetty's Anaganaga Oka Raju Movie Promo Out: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, బ్యూటీ మీనాక్షి చౌదరి మరో క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయనుండగా... తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
వెరైటీగా ప్రోమో వీడియో
ప్రోమో వీడియోను ఓ జ్యువెలరీ యాడ్ స్పూఫ్‌తో వెరైటీగా రిలీజ్ చేశారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి తాను వేసుకున్న జ్యువెలరీ గురించి చెబుతుండగా... హీరో నవీన్ పోలిశెట్టి వచ్చి 'ఇది జ్యువెలరీ యాడ్ కాదు. మన సినిమా అనగనగా ఒక రాజు ప్రోమో వీడియో.' అంటూ గుర్తు చేయగా... మళ్లీ అలానే చేస్తుంది. దీంతో నవీన్ పోలిశెట్టి మళ్లీ కట్ చెప్పి... 'ఇది జ్యువెలరీ యాడ్ కాదమ్మా. మన సినిమా గురించి మాట్లాడు. నీకు దండం పెడతా.' అంటూ నవ్వులు పూయించాడు. నేను నగలు వేసుకుంటే నాకేవీ గుర్తు రావు అంటూ మీనాక్షి చెప్పగా... ఆ నగలు తాను వేసుకుని ప్రోమో స్టార్ట్ చేస్తారు.
కోనసీమలో ఓ యువకుడు, యువతి మధ్య లవ్ ట్రాక్, సంక్రాంతి సంబరాలు అన్నింటినీ కలిపి ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకోగా ప్రోమో వీడియో మరింత హైప్ క్రియేట్ చేసింది. నవీన్, మీనాక్షి పోటా పోటీగా నవ్వులు పూయించారు. ఈ చిత్రానికి నవీన్ రచయితగా మారారు. ముఖ్యంగా సంక్రాంతికి ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026, జనవరి 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'OG' కోసం రికార్డులు వెయిటింగ్ - వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేశాయంతే...
ఈ మూవీకి మారి దర్శకత్వం వహిస్తుండగా... నవీన్, మీనాక్షిలతో పాటు రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'జాతిరత్నాలు' మూవీతో మంచి ఫేం సంపాదించుకున్న నవీన్ వరుస కామెడీ ఎంటర్‌టైనర్లతో అదరగొడుతున్నారు. లాస్ట్‌గా స్వీటీ అనుష్కతో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్నారు.
Star Entertainer 🌟 @NaveenPolishety is bringing 24 carat Pure Entertainment 😎
— Sithara Entertainments (@SitharaEnts) September 26, 2025
Here is the #AnaganagaOkaRaju SANKRANTHI PROMO 😎🕺
– https://t.co/FIBYUK3Ivi
Pandaga ki get ready for a laugh riot 🔥😍#AOR #NaveenPolishetty4 #AOROnJan14th 💫@Meenakshiioffl #Maari… pic.twitter.com/pZc1N1Hct5





















