Naveen Chandra New Movie Not A Doctor Announced : ఎప్పుడూ వైవిద్యమైన కథలు ఎంచుకుంటూ తనకుంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో నవీన్ చంద్ర. రీసెంట్‌గా సైకలాజికల్ థ్రిల్లర్ 'హనీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. తాజాగా మరో మిస్టరీ థ్రిల్లర్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్

మహా శివరాత్రి సందర్భంగా 'నాట్ ఏ డాక్టర్' అంటూ న్యూ మిస్టరీ థ్రిల్లర్ అనౌన్స్ చేశారు. సరికొత్త పోస్టర్ బిగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. అడవి నేల నుంచి పైకి లేచిన వేళ్లు, దానిపై కప్పిన మట్టి... వేళ్లే వేర్లుగా ఎదిగిన మహా వృక్షం. ఓ మిస్టీరియస్ ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు దీని బట్టి అర్థమవుతోంది. 'ఎప్పుడూ రాయని నవల ఆధారంగా' అంటూ ట్యాగ్ ఇవ్వడం గతం కంటే డిఫరెంట్ స్టోరీ అని కన్ఫర్మ్ అవుతోంది. 

ఈ మూవీలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తుండగా... 'భానుమతి రామకృష్ణ', 'మంత్ ఆఫ్ మధు' మూవీస్ ఫేం డైెరెక్టర్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబోలో ఇది మూడో మూవీ. 'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద' వంటి హిట్ మూవీస్ నిర్మించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. 

Also Read : నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి మళ్ళీ వస్తాం... 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త సినిమా - సక్సెస్‌ మీట్‌లో బిగ్ అప్డేట్