Nani Sujeeth Movie Title : నాని, 'ఓజీ' డైరెక్టర్ సుజీత్ కొత్త మూవీ టైటిల్ ఇదే - అతను నెంబర్ వన్ చెఫ్ కాదు... కానీ...
Bloody Romeo Video : నేచరల్ స్టార్ నాని సరికొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'ఓజీ' డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుండగా... డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.

Nani Sujeeth Movie Announcement Video Released : నేచరల్ స్టార్ నాని బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. గతేడాది 'ఓజీ'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఆయన కొత్త మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. స్పెషల్ డే సందర్భంగా ఆ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు.
వెరైటీ టైటిల్
ఈ మూవీకి 'బ్లడీ రోమియో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీ రూపొందించనున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. తన ఫస్ట్ మూవీ 'రన్ రాజా రన్' స్టైల్‌లో ఉంటుందని ఇంతకు ముందే డైరెక్టర్ సుజీత్ తెలిపారు. 'చిటికెడు కరుణ, పడికెడు కోపం, బారెడు బీభత్సం... మతిపోయేంత ప్రేమ' అంటూ ఓ వంటకాన్ని తయారు చేయడం చూపిస్తూ నాని పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు.
'నెంబర్ వన్ చెఫ్ కాదు... గ్యాంగ్ స్టర్' అంటూ ఎలివేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్ అవుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యానిమస్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ బోయిన్పల్లి నిర్మిస్తున్నారు.
View this post on Instagram
Also Read : వెడ్డింగ్ ఆఫ్ విరోష్ సెలబ్రేషన్స్ - ఫోటోలు షేర్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక
హీరోయిన్ ఎవరు?
ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. నాని సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే, స్పిరిట్ బ్యూటీ తృప్తి డిమ్రి పేరు కూడా వినిపిస్తోంది. మరి హీరోయిన్ ఎవరు అనే దానిపై మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
'ది ప్యారడైజ్' కంప్లీట్ కాగానే 'బ్లడీ రోమియో' ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది. ఈ మూవీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుజీత్ తెలిపారు. షూటింగ్ ఎక్కువగా యూరప్‌లోనే ఉండబోతుందని చెప్పారు. త్వరలోనే మిగిలిన వివరాలు రానున్నాయి.
























