నేచురల్ స్టార్ నాని తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. 'దసరా' సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన నాని.. కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్స్ ని రాబడుతున్నాడు. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్ సీస్ లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటికే యూఎస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి దూసుకుపోతున్నాడు. 

 

‘దసరా’ మూవీ శ్రీరామనవమి స్పెషల్ గా తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ రూరల్ మాస్ ఎంటర్టైనర్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించింది. రెండో రోజు కూడా అదే హవా కొనసాగించిందని తెలుస్తోంది.

 

ఇక యుఎస్ లో 'దసరా' సినిమా వీర విహారం చేస్తోంది. ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్స్ కు పైగా సాధించి సత్తా చాటిన ఈ చిత్రం.. మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిపోయింది. యూఎస్‌లో దసరా కలెక్షన్స్ 1 మిలియన్‌ కు చేరుకోవడంతో, 8 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్న హీరోగా నాని నిలిచాడు. 

 

మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్న మన హీరోల లిస్ట్ చూస్తే, హయ్యెస్ట్ 1 మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ లో నిలిచాడు. మహేశ్ 11 మిలియన్ డాలర్ మూవీస్ వున్నాయి. అయితే ఇప్పుడు నాని 8 సినిమాలతో మహేష్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మిగతా టాలీవుడ్ స్టార్ హీరోలంతా నాని తర్వాతే ఉన్నారు.

 

ఈ లిస్టులో ఎన్టీఆర్ 7 సినిమాలతో థర్డ్ ప్లేస్ లో ఉండగా.. పవన్ కళ్యాణ్ (6), అల్లు అర్జున్ (5), చిరంజీవి (4), ప్రభాస్ (4), వరుణ్ తేజ్ (4) వంటి హీరోలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రామ్ చరణ్ (3), విజయ్ దేవరకొండ (3), వెంకటేష్ (3), బాలకృష్ణ (3), నాగార్జున (2), నాగ చైతన్య (2) మిలియన్ డాలర్ క్లబ్ లో చేరారు. అఖిల్, నిఖిల్, నితిన్, అడివి శేష్, నవీన్ పోలిశెట్టి వంటి కుర్ర హీరోలు కూడా తలా ఒక సినిమాతో మిలియన్ డాలర్ల క్లబ్‌ లో చోటు సంపాదించారు.

 

నాని US మిలియన్ డాలర్ సినిమాలు:


భలే భలే మగాడివోయ్ (2015) – $1,430,026

జెర్సీ (2019) – $1,323,526

నిన్ను కోరి (2017) – $1,196,559

MCA (2017) – $1,081,952

నేను లోకల్ (2017) – $1,079,986

ఈగా (2012) – $1,022,744

అంటే సుందరానికి (2022) – $1,140,642

దసరా (2023) - $1 మిలియన్ (ప్రస్తుతానికి)

 

కాగా, నాని - కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా 'దసరా' సినిమా తెరకెక్కింది. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్ లో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంతో నాని టైర్-1 హీరోల లిస్టులో చేరడం ఖాయమని నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.