HIT 3 Movie HD With Original Audio Leaked Online: నేచురల్ స్టార్ నాని (నాని) 'హిట్ 3' (HIT 3) మూవీ గురువారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. 24 గంటలైనా గడవక ముందే ఈ మూవీ టీంకు షాక్ తగిలింది. ఈ మూవీ ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపింది.
ఒరిజినల్ ఆడియోతో HD ప్రింట్
'హిట్ 3' థియేటర్లలోకి వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఒరిజినల్ ఆడియోతో HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో మూవీ టీంతో పాటు నాని ఫ్యాన్స్, సినీ ప్రియుల్లో ఆందోళన నెలకొంది. పైరసీ భూతాన్ని కట్టడి చేయాలని.. సినీ ఇండస్ట్రీని కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రికార్డు కలెక్షన్లు
విడుదలకు ముందే 'హిట్ 3' బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. ఇక ఫస్ట్ డే మార్నింగ్ షోస్ దాదాపు 80 శాతం, మధ్యాహ్నం షోస్ 92 శాతం, ఈవినింగ్ షోస్ 91 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. ఓపెనింగ్ డే ఈ మూవీకి రూ.17 కోట్ల కంటే ఎక్కువ షేర్ వస్తుందని అంచనా. ఇక గ్రాస్ విషయానికొస్తే రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. 'సరిపోదా శనివారం' తర్వాత నాని ఖాతాలో మరో హిట్ పడిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
యూఎస్ మార్కెట్‌లో అదుర్స్
యూఎస్ మార్కెట్‌లో అప్పుడే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ గ్రాస్ క్లబ్‌లో చేరిపోయింది. ఇక వీకెండ్‌కు చాలా ఈజీగా 2 మిలియన్ మార్క్‌ను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
శైలేష్ కొలను దర్శకత్వంలో.. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. సినిమాలో నాని సరసన 'కేజీఎఫ్' ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. వయలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని వైల్డ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది.
స్టోరీ ఏంటంటే?
ఏసీపీ అర్జున్ సర్కార్ (నాని) జమ్మూ కశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (హిట్)లో ఆఫీసర్. అక్కడ డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ దారుణమైన మర్డర్ వెలుగుచూస్తుంది. అది చేసిన హంతకుడిని పట్టుకుంటారు. అయితే, ఆ తర్వాత సేమ్ ప్యాట్రన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 13 హత్యలు జరుగుతాయి. అన్నిటి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? అని అర్జున్ సర్కార్ అనుమానిస్తాడు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని తెలుసుకున్న అర్జున్.. డార్క్ వెబ్ గురించి తెలుసుకుంటాడు.
వాటిని ఛేదించేందుకు బిహార్, గుజరాత్ ప్రాంతాలకు వెళ్తాడు అర్జున్ సర్కారు. ఆ కేస్ కొలిక్కి వస్తున్న సమయంలోనే అతనికి విశాఖ బదిలీ అవుతుంది. ఆ సమయంలో ఆ కేసును ఏం చేశాడు? మృదుల (శ్రీనిధి శెట్టి)తో అర్జున్ సర్కార్ ప్రేమ కథ ఏమిటి? అసలు హత్యలకు కారణం ఏంటి?, విశాఖకు వచ్చిన తర్వాత కూడా అర్జున్ పాత కేసును ఎందుకు ఛేదించేందుకు ప్రయత్నించాడు? ఈ ప్రయాణంలో అతను తెలుసుకున్న నిజాలేంటి? వంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.