Priyanka Chopra Shares Pics From Africa: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో విజువల్ వండర్ 'SSMB29' గురించి మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మహేష్ బాబు హీరో, Globe Trotter అని తప్ప దేనిపైనా అధికారిక ప్రకటన రాలేదు. ఫస్ట్ టైం జక్కన్న ఈ మూవీ విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రెస్ మీట్స్ కూడా లేవు. ఏ చిన్న అప్టేట్ కానీ, రూమర్ కానీ వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది.

ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక

ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పలు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... ప్రస్తుతం ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ప్రియాంక షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక... అక్కడి నేచర్, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్‌లో SSMB29

ప్రియాంక ఫోటోలు షేర్ చేయడంతో ఇవి ఆఫ్రికాలోనివే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి 'SSMB29' ట్రెండింగ్‌లో ఉంది. కొందరు ఆ ప్రాంతాన్ని గుర్తు పడుతూ 'మీరు కెన్యాలో ఉన్నారా?', 'ఇవి ఉత్తర ఆఫ్రికాలో తీసిన ఫోటోస్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా... మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా రియాక్ట్ అవుతూ లవ్ సింబల్ ఎమోజీలు కామెంట్ చేశారు. 

Also Read: అమ్మమ్మ ఇంటికి రామ్ చరణ్ - బయటకొచ్చి రిసీవ్ చేసుకున్న బన్నీ... ఒక్క హగ్గుతో రూమర్లకు చెక్

నవంబరులో అప్డేట్... హాలీవుడ్ రేంజ్‌లో

ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ప్రీ లుక్ రిలీజ్ చేయగా... నవంబరులో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ చెప్పారు. దీంతో పాటే 'Globe Trotter' అంటూ హింట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్‌తో పాటే టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్‌ను హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్: ది ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న రిలీజ్ కానుండగా... ప్రమోషన్స్ కోసం ఆయన ఇండియాలోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో 'SSMB29' మూవీ బిగ్ అప్డేట్‌ని ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని భావిస్తున్నారట. ఇదే జరిగితే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పేరు మార్మోగుతుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ అడ్వెంచరస్ జర్నీ అని తెలుస్తుండగా... ఆ సాహస యాత్ర దేని కోసం అనేది ఓ సస్పెన్స్. 2027లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.