Nagarjuna Vaasivaadi Tassadiyya : అక్కినేని ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - సోగ్గాడు మళ్లీ వచ్చేస్తున్నాడు... రిలీజ్ ఎప్పుడంటే?
Nagarjuna Sankranthi Movie : కింగ్ నాగార్జున తన కొత్త మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీ ఫ్రాంచైజీలో కొత్త మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Nagarjuna's Vaasivaadi Tassadiyya Movie Release Date Locked : కింగ్ నాగార్జున ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీకి మరో సీక్వెల్ అప్డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'బంగార్రాజు' మూవీలో మాస్ పార్టీ సాంగ్ 'వాసివాడి తస్సాదియ్యా'నే టైటిల్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
రిలీజ్ ఎప్పుడంటే?
కొత్త మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సంక్రాంతికి సోగ్గాళ్లు వచ్చేస్తున్నారంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు. 'వాసివాడి తస్సాదియ్యా 2027, జనవరి 15 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండుగ ఇంకా కలర్ ఫుల్‌గా ఉంటుంది కదా. ఈ డేట్ మార్క్ చేసుకోండి.' అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు మొదటి రెండు మూవీస్‌కు దర్శకత్వం వహించిన కల్యాణ్ కృష్ణనే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.
వాసివాడి తస్సాదియ్యా 💫✨వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా💥 🔥🔥 డేట్ మార్క్ చేసుకోండి 🤩
— Annapurna Studios (@AnnapurnaStdios) February 8, 2026
Also Read : మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నా - సురేఖా వాణి కుమార్తె సుప్రీత కామెంట్స్ వైరల్
గోదారి కథ, ఫాంటసీ నేపథ్యంతో 2016లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కల్యాణ్ కృష్ణ దరకత్వం వహించిన ఈ మూవీలో నాగార్జున డ్యుయల్ రోల్ చేయగా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సీక్వెల్‌గా 2022లో వచ్చిన 'బంగార్రాజు' మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో నాగార్జున, రమ్యకృష్ణలతో పాటు నాగచైతన్య, కృతి శెట్టి, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి కొనసాగింపుగా లేటెస్ట్ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు, మిగిలిన వివరాలపై అప్డేట్స్ ఇవ్వనున్నారు.
























