Nagarjuna King 100 Movie: సైలెంట్‌గా వందో సినిమాకు పూజ చేసిన నాగార్జున... కింగ్ జోడీగా మహానటి!?
Nagarjuna 100th Movie Title: కింగ్ అక్కినేని నాగార్జున తన వందో సినిమాకు చాలా సైలెంట్‌గా పూజ చేశారు. ఈ సినిమా టైటిల్, ఇందులో హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోండి.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులలో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన వందో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ (Director Ra Karthik) చెప్పిన కథ తనకు నచ్చిందని, అదే తన వందో సినిమా అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను సైలెంట్‌గా స్టార్ట్ చేశారు.
అన్నపూర్ణలో సోమవారం పూజ!
Nagarjuna 100th Movie Launched: నాగార్జున వందో సినిమా అంటే అటు అక్కినేని అభిమానులలో మాత్రమే కాదు... ఇటు తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన పాన్ ఇండియా స్టార్. వందో సినిమాకు ఉండే క్రేజ్ వేరు. అయితే ఎటువంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్‌గా తన వందో సినిమాను ప్రారంభించారు నాగార్జున.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం నాగార్జున వందో సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
నాగార్జునకు జంటగా మహానటి!
Keerthy Suresh to romance Nagarjuna: నాగార్జున వందో చిత్రానికి 'లాటరీ కింగ్' టైటిల్ ఖరారు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో నిజం లేదని సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ చిత్రానికి 'కింగ్ 100' వర్కింగ్ టైటిల్ పెట్టారు.
Also Read: లిటిల్ హార్ట్స్ తండ్రి... 90s కూతురు... Zee5లో కనబడుటలేదు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాగార్జునకు జంటగా ఆయన వందో సినిమాలో కథానాయికగా నటించే అవకాశం 'మహానటి' కీర్తి సురేష్ సొంతం చేస్తుందని టాలీవుడ్ టాక్. ఇప్పటి వరకు యంగ్ హీరోల సరసన కీర్తి సురేష్ సినిమాలు చేసింది. 'భోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించినప్పటికీ... అందులో ఆమెది సిస్టర్ రోల్. కానీ ఇప్పుడు నాగార్జున సినిమాలో ఆమెది హీరోయిన్ రోల్.
'మన్మధుడు', 'కింగ్', 'ఢమరుకం' నుంచి మొదలు పెడితే రీసెంట్ 'కుబేర' వరకు నాగార్జున సినిమాలకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఇప్పుడు నాగార్జున వందో సినిమాకు సైతం సంగీతం అందించే బాధ్యతను అతని చేతిలో పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం మీద నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: మాస్ మహారాజా కొత్త సినిమాకు క్లాస్ టైటిల్... భర్తలూ, ఇది మీ కోసమే!





















