Virat Karna First look From Naga Bandham: యువ హీరో, 'పెదకాపు' ఫేం విరాట్ కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్... అనేది ట్యాగ్ లైన్. 'గూఢచారి', 'డెవిల్' వంటి హిట్ సినిమాలను నిర్మించడంతో పాటు 'డెవిల్'తో దర్శకుడిగా మారిన అభిషేక్ నామా మరోసారి మెగా ఫోన్ పట్టిన చిత్రమిది.
ఎపిక్ అడ్వెంచరస్ థ్రిలర్ డ్రామాగా...
అనంత పద్మనాభ స్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయల్లో బయటపడ్డ నిధులు, నిక్షేపాల నుంచి ప్రేరణ పొందిన కథతో 'నాగబంధం' సినిమా రూపొందుతోంది. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో కూడిన పవర్ఫుల్ స్క్రిప్ట్ ను రాసుకున్న అభిషేక్ నామా గతేడాది ఉగాదికి ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. థండర్ స్టూడియోస్ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా మధుసూదన్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ మూవీ అంచనాలు పెంచింది. కేజీయఫ్ నటుడు అవినాస్ మిస్టీరియస్ అఘోరిగా నటిస్తున్న ఆయన పాత్ర పరిచయం చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఎలాంటి అప్డేట్ లేదు.
రగ్గడ్ లుక్ లో విరాట్ కర్ణ
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూవీ సర్ప్రైజింగ్ అప్డేట్ వదిలారు. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న విరాట్ కర్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ లుక్ విడుదల చేశారు. ఇందులో విరాట్ కర్ణ లుక్ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది. గిరజాల జుట్టు, గడ్డం, కండలు తిరిగిన శరీరాకృతితో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించాడు. సముద్రంలో భయంకరమైన మొసలితో నిర్భయంగా పోరాడుతున్నట్లు చూపించారు. ఒక చేతితో మొసలి నోరు తెరిచి పట్టుకుని కత్తితో దానిపై దాడి చేస్తున్నట్టు పోస్టర్ లో చూపించారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది.
పాన్ ఇండియాగా భారీ బడ్జెట్ తో
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుటున్న ఈ సినిమాను పురాతనమైన విష్ణు దేవాలయాల్లో దాచిన రహస్యాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా నాగబంధం పవిత్ర ఆచారాన్ని ఈ సినిమాలో ప్రధాన అంశంగా చూపించబోతున్నారు. దేవాలయాల్లోని నిక్షిప్తమైన నిధి రహస్యాలు ఆధారంగా నాగబంధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు అభిషేక్ నామా. పురాతన రహస్యాలకు సరికొత్త, ఆధునిక కథనంలో నాగబంధం కథ సాగనుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ సినిమా ప్రముఖ సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. అయక్షే సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్ అవినాస్ వంటి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025లో ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడతో పాటు మలయాళ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ మూవీ సరికొత్త అప్డేట్స్ పాటు రిలీజ్ డేట్ ని మూవీ టీం ప్రకటించనుంది.