Akkineni Nagachaitanya : అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ఇప్పటికే 'షోయూ' పేరుతో రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టిన చైతు ఈసారి ఎవరు ఊహించని విధంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఇదే విషయాన్ని చైతు స్వయంగా రివీల్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోని సైతం పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీసెంట్ గా 'కస్టడీ'(Custody) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతు ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు. ఇక 'కస్టడీ' తర్వాత తన కెరియర్లో 23వ సినిమాని చందు మొండేటితో చేసేందుకు సిద్ధమయ్యాడు.


ఇదిలా ఉంటే సెలబ్రిటీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో తెలిసిందే కదా. సెలబ్రిటీలకు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే కచ్చితంగా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూడాల్సిందే. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి కావలసిన అప్డేట్స్ అందిస్తున్నారు సెలబ్రెటీలు. ఇప్పటికే చాలా మంది తమకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమధ్య కొందరు నటీనటులు మాత్రం సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అందులో తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.


యూట్యూబ్ ఛానల్స్ ని ఎక్కువగా సీరియల్ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు రన్ చేసేవారు. కానీ ఈ లిస్టులో అక్కినేని హీరో నాగచైతన్య కూడా చేరిపోయాడు. అక్కినేని నాగచైతన్య పేరుతో యూట్యూబ్ ఛానల్ రూపొందించి అందులో శుక్రవారం ఒక వీడియో పోస్ట్ చేశాడు చైతు. ఈ మేరకు తాను కూడా యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టానంటూ వెల్లడించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. 'జుట్టు గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, అందుకు చైతూ బదులిస్తూ.." ఆరు నెలలుగా జాబ్ లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నాను. పని ఏం లేక జుట్టు గడ్డం పెంచాను" అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చాడు.


ఆ తర్వాత తాను హీరోగా నటిస్తున్న చందు మొండేటి మూవీ కోసమే ఈ లుక్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. మొత్తం మీద నాగచైతన్య కూడా యూట్యూబ్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక చైతూ కొత్త సినిమా విషయానికొస్తే.. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. చైతు సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.


Also Read : 2023 లో కనిపించని స్టార్ హీరోలు, వచ్చే ఏడాది మాత్రం తగ్గేదేలే!