ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కథలో కీలకమైన ప్రధాన పాత్ర, విలన్ రోల్ పోషించారు. భారీ విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ 'కల్కి 2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ కీలకమైన అప్‌డేట్‌ అందించారు.

జూలై నుంచి 'కల్కి 2' షూటింగ్ షురూKalki 2898 AD Part 2 Regular Shooting Update: సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' చిత్రాన్ని నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేశారు. జూన్ 19న ఆ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కల్కి 2' గురించి మాట్లాడారు నాగ్ అశ్విన్. 

'కల్కి 2' స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. వచ్చే నెల (అంటే జూలై) నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని, అక్కడ నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తామని నాగ్ అశ్విన్ తెలిపారు. 'కల్కి 2' షూటింగులో ప్రభాస్ ఇంకా జాయిన్ కాలేదు. అయితే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తమ తమ క్యారెక్టర్లకు సంబంధించిన చిత్రీకరణను ప్రారంభించారు. షూటింగ్ అంతా ఏప్రిల్ 2027కి పూర్తి చేసి, డిసెంబర్ 2027లో థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు.

Also Read: Dimple Hayathi On Janhvi Kapoor Peddi Controversy - హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు

'కల్కి' సీక్వెల్‌లో కథ మొదటి భాగం కంటే మరింత పెద్దగా ఉంటుందట. మొదటి భాగంలో కమల్ హాసన్ పోషించిన విలన్ రోల్ 'సుప్రీమ్ యాస్కిన్'ను కొంత సేపు మాత్రమే చూపించారు. ఈసారి సీక్వెల్‌లో కమల్ రోల్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందులో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ అవసరం కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే... మొదటి భాగంలో నటించిన దీపికా పదుకోన్ బదులు సాయి పల్లవి నటించే అవకాశం ఉందని టాక్.

Also Read: Peddi Third Day Collections - బాక్సాఫీస్‌లో శనివారం రామ్ చరణ్ 'పెద్ది' సత్తా చాటిందా? మూడు రోజుల్లో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?