అన్వేషించండి

Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?

Nandus World Scam Latest Update: 'నందూస్ వరల్డ్' నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిపై వీసా పేరుతో విద్యార్థులు, ఉద్యోగులను మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. అవి నిజమైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూట్యూబర్ నందన, భర్త మధుకర్‌పై వీసా మోసం ఆరోపణలు.
  • CoS పేరుతో విద్యార్థుల నుండి కోట్లాది రూపాయలు వసూలు.
  • పన్ను ఎగవేత, శ్రమ దోపిడీ, బెదిరింపులు, జైలు శిక్ష ముప్పు.

యూట్యూబ్, సోషల్ మీడియాలో 'నందూస్ వరల్డ్' (Nandu's World Controversy) పేరుతో పాపులరైన నందన తెలుగు ప్రజలు చాలా మందికి తెలిసే ఉంటారు. 'మన శంకర వరప్రసాద్ గారు'తో పాటు ఓటీటీ రిలీజ్ 'సంధ్యా నామ ఉపాసతే'లో ఆమె నటించారు. నందనతో పాటు ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి గత వారంగా వార్తల్లో నిలుస్తున్నారు. వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి విద్యార్థులు, ఉద్యోగులను మోసం చేసినట్టు, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసుకోండి.

మధుకర్ - నందన దంపతులు ఏం చేశారు?
వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు - స్కామ్ ఏంటి?
నందు అలియాస్ నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి కలిసి వందలాది భారతీయులను, మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులను, ఉద్యోగార్థులను మోసం చేశారనేది ఆరోపణ. వీసాలు, ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశారని... సర్టిఫికెట్ స్పాన్సర్షిప్ (CoS) పేరుతో డబ్బులు దోచుకున్నారని పలువురు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కారు. వాళ్ళు చేసిన మోసం మనీ లాండరింగ్, ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్, కార్పొరేట్ ఫ్రాడ్‌ కిందకు వస్తుంది. 

సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఏమిటి?
What Is Certificate of Sponsorship - CoS?: నందూస్ వరల్డ్ కాంట్రవర్సీ తర్వాత 'సీఓఎస్' (Cos) వర్డ్ ఎక్కువ మందికి తెలిసింది. అసలు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఏమిటి? అంటే... యూకే చట్టాల ప్రకారం విదేశీ కార్మికులను స్పాన్సర్ చేయడం. సీఓఎస్ పేరుతో అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకోకూడదు. కానీ, నందు - మధుకర్ దంపతులు ఒక్కొక్కరి దగ్గర 15,000 నుంచి 20,000 పౌండ్ల వరకు (సుమారు 25 లక్షలు) వసూలు చేశారట. ఒకరిద్దరి దగ్గర కాదు... పదుల సంఖ్యలో జనాల దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నారట. ఇప్పుడు ఆ డబ్బులు కట్టిన వాళ్ళలో వీసాలు రాని వ్యక్తులు కోర్టు, పోలీసులను ఆశ్రయించారు.

నేరం రుజువైతే పదేళ్ళు జైలు శిక్ష ఖాయమా?
నందూస్ వరల్డ్ యూకే వీసా స్కామ్‌కు సంబంధించి అంతర్జాతీయ న్యాయవాది డా కావేటి శ్రీనివాస్ రావు చెప్పిన వివరాల ప్రకారం... 

వీసాల పేరుతో వసూలు చేసిన డబ్బులను కంపెనీ అకౌంట్లలోకి కాకుండా... భర్త మధుకర్, ఇండియాలోని తల్లిదండ్రుల అకౌంట్లలో నందన మళ్ళించారట. టాక్స్ ఎగ్గొట్టడం కోసమే ఈ విధంగా చేశారని టాక్. యూకే చట్టాల ప్రకారం టాక్స్ ఎవేషన్ (పన్ను ఎగవేత), మనీ లాండరింగ్ నేరాలు చేసినట్టు అవుతుంది. 

షెఫ్ (వంట పని) వంటి ఉద్యోగాలకు 40 గంటల పని ఇస్తామని చెప్పి, కేవలం ఐదు గంటల పని మాత్రమే ఇచ్చి, ముందుగా మాట్లాడిన జీతం కంటే తక్కువ ఇవ్వడం వంటివి చేశారని నందన - మధుకర్ దంపతులపై ఉన్న మరొక ఆరోపణ. ఆ విధంగా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన, బానిసత్వం కిందకు వస్తుంది.

Also ReadPeddi Vs Pushpa - పెద్ది వర్సెస్ పుష్ప... అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి

వీసాల కోసం కావచ్చు లేదా ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఎదురైన మోసం గురించి కావచ్చు... బాధితులు ఫోన్లు చేస్తే బ్లాక్ చేయడం, వాళ్ళను బెదిరించడంతో పాటు తమ ఆఫీసులు మూసివేయడం, ఇంటికి వచ్చిన వాళ్ళతో పోలీసులను పిలిచి పెట్టిస్తామని వార్నింగ్స్ ఇవ్వడం వంటివి చేశారని కూడా నందన - మధుకర్ దంపతులపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే, బాధితులు కొందరు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్ రికార్డింగ్‌లు, ఈ మెయిల్స్ వంటివి బయట పెడుతున్నారు. అవన్నీ కోర్టులో చెల్లుబాటు అవుతాయి.

Photo GalleryPawan Kalyan - పవన్ కళ్యాణ్ ఇంట్లో ఇదీ పరిస్థితి... ఎలక్షన్ రిజల్ట్స్ డే ఫోటోలు షేర్ చేసిన అన్నా కొణిదెల

నందూస్ వరల్డ్ దంపతులపై ఆరోపణలు నిజమని రుజువైతే యూకే, భారత చట్టాల ప్రకారం పదేళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇటువంటి స్కామ్ / నేరాలను రెండు దేశాల చట్టాలు తీవ్రంగా పరిగణిస్తాయి. జైలు శిక్షతో పాటు యూట్యూబ్ ఛానల్ రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే... నేరాలకు తమ సోషల్ మీడియాను వాడుకుంటున్నందున యూట్యూబ్ ఛానల్‌ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పిల్లలతో రీల్స్ చేయించి, ఆ రీల్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కనుక చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్ కింద పరిగణిస్తారు. భారత్, యూకే మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. దాంతో నిందితులు ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయవచ్చు. భారత్‌లో ఈ దంపతులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. సో... తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varanasi Title Glimpse : వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget