మురళీ మోహన్ (Murali Mohan), ఆమని ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' (Andhrula Annapurna Dokka Seethamma Movie). టీవీ రవి నారాయణ్ దర్శకుడు. ఉషారాణి మూవీస్ పతాకంపై వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఆశ్రమాల్లో సెలబ్రేట్ చేసుకుంటా...వీళ్ళు పిలిచారని ఇప్పుడు ఇటు వచ్చా!తన పుట్టినరోజును ఎప్పుడూ వృద్ధ, అనాథ ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటానని, ఈ రోజు కూడా ఓ ఆశ్రమానికి వెళ్లాల్సి ఉండగా 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' యూనిట్ పిలిచారని ఇటు వచ్చాయని మురళీ మోహన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''చిన్న నిర్మాతలైనా నా బర్త్ డేను సెలబ్రేట్ చేసినందుకు థాంక్స్. రేలంగి గారితో నా అనుబంధం మరువలేనిది. కాటన్ దొర సైతం పొగిడిన డొక్కా సీతమ్మ మీద సినిమా తీయాలని అనుకున్నా... వీళ్ళు చేస్తున్నారు. సన్మానం చేస్తామని లండన్ రమ్మని అడిగితే ఇక్కడ ఉన్నవాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారని ఆవిడ వెళ్ళలేదు. అటువంటి గొప్ప మనిషి మీద సినిమా తీస్తుండటం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
తన మొదటి హీరో మురళీ మోహన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని దర్శకుడు టీవీ రవి నారాయణ్ తెలిపారు. కథ చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎంకరేజ్ చేస్తున్నారని, ఆయన సహకారం మరువలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ నాగు, 'లయన్' సాయి వెంకట్, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?
Andhrula Annapurna Dokka Seethamma Movie Cast And Crew: మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ'లో రాజమౌళి, ఆకెళ్ల, 'జబర్దస్త్' అప్పారావు, ఆర్‌సిఎం రాజు, చినబాబు, కాకినాడ ప్రసాద్, 'జబర్దస్త్' బాబి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కేశవి, పిట్టలదొర, కూరాకుల చిన్న, డి వీరబాబు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం: ఎం. రవి కుమార్, కూర్పు: శ్రీకృష్ణ, ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీ వాత్సవ్, పాటలు: చంద్రబోస్ - విజయ్ కుమార్ - వీరు, నృత్య దర్శకత్వం: సుచిత్రా చంద్రబోస్, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, సహ నిర్మాతలు: వలిసెట్టి చాహితి ప్రియా - పోల గాని సుబ్బారావు, నిర్మాణ సంస్థ: ఉషారాణి మూవీస్, నిర్మాతలు: వల్లూరి రాంబాబు - మట్టా శ్రీనివాస్, దర్శకుడు: టి.వి. రవి నారాయణ్.