Bollywood: హీరోయిన్ భర్త మీద లుకవుట్ నోటీస్... గృహసింహ కేసులో కొత్త ట్విస్ట్
Celina Jaitly Peter Haag Case Row: విష్ణు మంచు 'సూర్యం'లో హీరోయిన్ సెలీనా జైట్లీ తన భర్త మీద గృహ హింస కేసు పెట్టారు. ఆమె భర్త పీటర్ మీద ముంబై పోలీసులు లుకవుట్ నోటీస్ జారీ చేశారు.

ఫెమినా 'మిస్ ఇండియా' (2001) విజేత, అందాల భామ సెలీనా జైట్లీ (Celina Jaitly) గుర్తు ఉన్నారా? హిందీలో 'నో ఎంట్రీ'తో పాటు 'గోల్ మాల్ రిటర్న్స్', 'థాంక్యూ' సినిమాల్లో నటించారు. ఆమె 'మిస్ యూనివర్స్'లో నాలుగో రన్నరప్ కూడా.
తెలుగు సినిమాలకు వస్తే... డైనమిక్ స్టార్ విష్ణు మంచు 'సూర్యం'లో కథానాయిక. కొన్ని రోజుల క్రితం భర్త మీద గృహ హింస కేసు పెట్టారు (భర్త మీద సెలీనా జైట్లీ పెట్టిన కేసు పూర్వాపరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి). ఇప్పుడు ఆ కేసులో కీలక మలుపు చోటు చేసింది. ఆమె భర్త మీద ముంబై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు.
పీటర్ హాగ్ మీద లుకవుట్ నోటీసులు జారీ
బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ భర్త పీటర్ హాగ్ (Peter Haag) మీద ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతే కాదు... ఆయన మీద లుకవుట్ నోటీసులుజారీ చేశారు.
Also Read: Rashmika Marriage - 'సు ఫ్రమ్ సో' దర్శకుడితో రష్మిక పెళ్లి... ఫోటోలు వైరల్
View this post on Instagram
తన మీద భర్త పీటర్ హాగ్ గృహ హింస వేధింపులతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో కొన్ని రోజుల క్రితం సెలీనా జైట్లీ ఫిర్యాదు చేశారు. అందులో తనను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించారని, ఆర్థికంగా దెబ్బ తీశారని పేర్కొన్నారు. ఆ కేసులో విచారణకు పీటర్ హాగ్ సహకరించకపోవడంతో అతని మీద లుకవుట్ నోటీస్ జారీ చేశారు.
View this post on Instagram
పెళ్లి తర్వాత తనను ఏ పని చేయనివ్వలేదని సెలీనా జైట్లీ ఆరోపించారు. తనకు ఎటువంటి ఆర్థిక సహాయ సహకారాలు లేకుండా చేశారని తెలిపారు. అంతే కాకుండా... తనను పని మనిషి అని పిలిచేవాడని, తన మీద జాత్యహంకార వ్యాఖ్యలు చేసేవాడని ఆరోపణలు చేశారు. పీటర్, సెలీనా వివాహం 2011లో జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలను తనకు కాకుండా దూరం చేశారని, మరణించిన తన కుమారుడ్ని మాత్రమే తాను కలవగలనని ఇటీవల సమాధి దగ్గర దిగిన ఫోటోను షేర్ చేశారు సెలీనా జైట్లీ.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















