Mugguru Kothulu First Look Released: ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సినిమాలు వచ్చిన ప్రతిసారీ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కొత్త హీరోలు చేసినా కలెక్షన్లు ఇచ్చారు. ఆ నమ్మకంతో మరో కామెడీ సినిమా 'ముగ్గురు కోతులు' రూపొందుతోంది.
కిటికీ లోనుంచి 'ముగ్గురు కోతులు'తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ముగ్గురు కోతులు'. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సంస్థ నిర్మాణ భాగస్వామి. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్షిక పాశం హీరోయిన్.
'ముగ్గురు కోతులు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టు ముగ్గురు హీరోల పాత్రల్ని చూపించారు. కిటికీ లోనుంచి వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Mugguru Kothulu Cast And Crew: తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ముగ్గురు కోతులు' సినిమాకు కూర్పు: జమీర్ షేక్, ఛాయాగ్రహణం: రాజ్ నోముల, సంగీతం: ఎస్. సుహాస్, సమర్పణ: జీఎస్ఆర్ క్రియేషన్స్, సహ సమర్పణ: స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్, నిర్మాత: శోభారాణి గరిమెల్ల, దర్శకుడు: కార్తీక్ గరిమెల్ల.
