Mrunal Thakur About Prabhas Next Project Fauji: సినిమాల‌కి సంబంధించి, యాక్ట‌ర్లకి సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్న‌ట్లుగా కొన్ని వార్త‌లు నిజం అవుతాయి. అయితే, కొన్ని మాత్రం ఎవ‌రో ఊహించి రాసిన‌వే ఉంటాయి. సోష‌ల్ మీడియా వ‌చ్చాక అలాంటి ప్ర‌చారాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక మృణాల్ ఠాకూర్‌కు సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అదే ఆమె ప్ర‌భాస్ తో క‌లిసి న‌టిస్తున్నార‌ని. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చేశారు మృణాల్. ఆమె ఏమ‌న్నారంటే? 


ఇన్ స్టాలో అడిగిన ప్ర‌శ్న‌కి.. 


మృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఒక్క సినిమాతోనే కుర్ర‌కారు మొత్తాన్ని ఆమె వైపుకు తిప్పుకుంది మృణాల్ ఠాకూర్. ఇదిలా ఉంటే.. ఆమెకు సంబంధించి ఒక వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. మృణాల్ ఠాకూర్ ప్ర‌భాస్‌తో క‌లిసి 'ఫౌజీ' సినిమాలో న‌టిస్తుంద‌ని తెలిసి అబ్బా కాంబినేష‌న్ సూప‌ర్ అంటూ ఆనంద‌ప‌డ్డారు. అయితే, ఆ వార్త‌ల‌పై మృణాల్ క్లారిటీ ఇచ్చి అంద‌రినీ డిస‌పాయింట్ చేసింది. తాను ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించ‌డం లేదంటూ తేల్చి చెప్పింది మృణాల్. ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ లో ముచ్చ‌టించిన ఆమె.. ఈ క్లారిటీ ఇచ్చింది. "మీరు ప్ర‌భాస్‌తో క‌లిసి 'ఫౌజీ'లో న‌టిస్తున్నారా?" అని అడిగిన ప్ర‌శ్న‌కి "సారీ.. నేను ఆ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డం లేదు" అంటూ స‌మాధానం చెప్పారు మృణాల్. 


హ‌నురాఘ‌వ‌పుడి డైరెక్ష‌న్ లో.. 


వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు ప్ర‌భాస్. హ‌ను రాఘ‌వ‌పుడితో క‌లిసి 'ఫౌజీ' అనే సినిమా చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ని తెలుగులో ప‌రిచ‌యం చేసింది హ‌ను రాఘ‌వపుడినే. 'సీతారామం' సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టారు ఆయ‌న‌. దీంతో మృణాల్ ఠాకూర్ ని త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా తీసుకుంటార‌ని అనుకున్నారు అంద‌రూ. కానీ, అది జ‌ర‌గ‌లేదు. కాగా.. మృణాల్ ఇటీవ‌ల రిలీజైన ప్ర‌భాస్ సినిమా 'క‌ల్కీ 2898ఏడీ'లో ఒక చిన్న పాత్ర చేసిన విష‌యం తెలిసిందే. 


త్వ‌ర‌లోనే షూటింగ్..


'ఫౌజీ' షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. క‌ల‌క‌త్తా, హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సుభాస్ చంద్ర‌బోస్ మీద ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇటీవ‌ల రిలీజైన ప్ర‌భాస్' కల్కీ 2898 ఏడీ' సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. 'రాజాసాబ్' నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ గ్లింప్స్ కూడా ప్ర‌భాస్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటుంది. దాంట్లో ప్ర‌భాస్ కొత్త లుక్ లో, అందంగా, స్టైలిష్ గా  ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆయ‌న అభిమానులు. మృణాల్ విష‌యానికొస్తే ఆమె ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌లిసి మృణాల్ న‌టించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేదు.


Also Read: గాయంతోనే 'దేవర' షూటింగ్‌ - జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన టీం