అన్వేషించండి

Suriya 47 : అప్పుడు భర్తతో హిట్ సినిమా... ఇప్పుడు సూర్య సినిమాలో కథానాయికగా!

Nazriya Nazim : సూర్య మలయాళం సినిమాలో నజ్రియా నజిమ్ హీరోయిన్​గా చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూసేద్దాం.

తమిళ నటుడు సూర్య 'సూర్య 47’ (Suriya 47 - వర్కింగ్ టైటిల్) సినిమాను మలయాళం డైరక్టర్​తో చేస్తోన్న విషయం తెలిసిందే. ఆవేశం డైరక్టర్ జితు మాధవన్(Jithu Madhavan)​తో సూర్య ఈ సినిమా చేస్తోండగా.. ఇప్పుడు దాని గురించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్​గా చేయబోతున్నట్లు కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్​గా క్లారిటీ రానప్పటికీ.. నజ్రియా నజిమ్ (Nazriya Nazim) ఈ సినిమా చేయబోతుందని బజ్ వినిపిస్తోంది. 

ముందు ఫాహద్​తో.. తర్వాత నజ్రియాతో!?

ఆవేశం సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరక్టర్ జితు మాధవన్.. ఆ సినిమాలో చేసిన ఫాహాద్ ఫాసిల్ వైఫ్​తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్​ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. 'సూర్య 47’ కోసం నజ్రియాతో చర్చలు జరిపారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై జితు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ నజ్రియా, సూర్య కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ వర్క్ అయితే సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు కావడం పక్కా. 

నజ్రియా క్రేజ్

మలయాళ ప్రేక్షకులకు నజ్రియా చిన్ననాటి నుంచే తెలుసు. పలు కార్యక్రమాల్లో హోస్ట్​గా చేసింది. అలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలు అందుకుంది. తెలుగు, తమిళంలో కూడా నజ్రియాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో నానితో 'అంటే సుందరానికి' సినిమా చేసింది ఈ బ్యూటీ. సూర్యకి కూడా టాలీవుడ్​లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ తెలుగులోనూ మంచి రీచ్​ని అందుకోనుంది. పైగా ఇప్పుడు సూర్య నేరుగా తెలుగులో సినిమా చేసి.. విడుదల చేస్తున్నారు. 

వెంకీ అట్లూరీ డైరక్షన్​లో ఫ్యామిలీ ఎంటర్​టైన్​మెంట్ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరిదశలో ఉంది. త్వరలోనే సూర్య నటించిన కరుప్పు అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సూర్య 47 షూటింగ్ కూడా ఈ ఏడాది చివరికి ప్రారంభం కానుంది. 2026లో సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఈ మూవీలో సూర్య పోలీస్​ పాత్రలో కనిపించనున్నారనే బజ్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
Action Thriller OTT : కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
Jagamae Sangeetham Series OTT : మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
I'm Game Twitter Review - 'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?
'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget