Mouni Roy Disha Patani: ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ
Mouni Roy Disha Patani Relationship: మౌనీ రాయ్, దిశా పటానీల స్నేహం హాట్ టాపిక్‌గా మారింది. మౌని విడాకులకు దిశ కారణమని డిస్కషన్ జరుగుతోంది. ఈ తరుణంలో తమ రిలేషన్షిప్ మీద మౌనీ రాయ్ క్లారిటీ ఇచ్చారు.

Mouni Roy Disha Patani Controversy: మౌనీ రాయ్, దిశా పటానీల స్నేహం హాట్ హాట్ టాపిక్‌గా మారింది. వీళ్ళిద్దరి సంబంధంపై బోలెడు పుకార్లు వస్తున్నాయి. ఆ ప్రచారం వివాదాస్పదం అవుతోంది. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ (Suraj Nambiar)తో మౌనీ రాయ్ విడాకులకు దిశా పటానీ కారణం అని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో తమ రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ ఇచ్చారు.
చిన్న చెల్లి... దిశా పటానీపై మౌనీ రాయ్ పోస్ట్!
మౌనీ రాయ్, దిశా పటానీల స్నేహం ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ముంబైలో రెస్టారెంట్లకు మాత్రమే కాదు... దుబాయ్, మాల్దీవులకు విహార యాత్రలకు సైతం ఇద్దరూ కలిసి వెళతారు. సూర్య నంబియార్, మౌనీ రాయ్ విడిపోయిన తర్వాత అన్ని వేళ్ళు దిశా పటానీ వైపు తిరిగాయి. ఆ విడాకులకు దిశా పటానీ కారణం అని ప్రచారం జరిగింది.
మౌనీ రాయ్, దిశా పటానీ మధ్య సంథింగ్ సంథింగ్ అని రూమర్స్ వచ్చాయి. వాళ్ళ స్నేహం సంబంధంగా మారిందని కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో 'చిన్న చెల్లి' అంటూ దిశా పటానీతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో మౌనీ రాయ్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్టును తొలగించడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఎందుకు డిలీట్ చేశారు? అనేది ప్రశ్నగా మారింది.
Also Read: Peddi Japan Release Update - రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్
మౌనీ రాయ్ షేర్ చేసిన ఆ ఫోటోలు చూస్తే... బ్లాక్ కలర్ కట్ అవుట్ మినీ డ్రస్‌లో ఆమె స్టైలిష్‌గా కనిపించారు. వైట్ కలర్ స్పోర్ట్స్ బ్రా, లూజ్ డెనిమ్ జీన్స్‌తో డ్రస్ ధరించి క్యాజువల్ లుక్‌లో ఉన్నారు దిశా పటానీ. ''నా చిన్న చెల్లిని మిస్ అవుతున్నాను... త్వరగా తిరిగి వచ్చేయ్" అని ఆ ఫొటోలకి మౌనీ రాయ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ డిలీట్ చేసినా... అప్పటికే స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదీ సంగతి!
Mouni Roy is in Cannes and Posted this Story for Her Darling Friend Disha Patani with special message 😍#MouniRoy #DishaPatani pic.twitter.com/WjBAy4IqzW
— Miss Filmy (@MissFilmyAddict) May 25, 2026
ఇటు మౌనీ రాయ్ గానీ, సూరజ్ నంబియార్ గానీ తాము విడిపోవడానికి అసలు కారణం ఏమిటి? అనేది చెప్పలేదు. దిశా పటానీ కారణమని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. దాంతో తన సోషల్ మీడియాలో అకౌంట్‌లోని కొన్ని పోస్ట్‌లకు కామెంట్ చేసే ఆప్షన్ తీసేశారు దిశా పటానీ. మే 18న తమ మధ్య గొడవ లేదా కొట్లాట వంటిది ఏదీ జరగలేదని... తాము విడిపోవడానికి మూడవ వ్యక్తి ప్రమేయం లేదని, దిశా పటానీపై వస్తున్న పుకార్లు నిరాధారమైనవని సూరజ్ నంబియార్ స్పష్టం చేశారు. అయితే... డబ్బులు వాడుకోవడంతో పాటు మోసం చేయడంతో మౌనీ రాయ్ విడిపోవాలని డిసైడ్ అయ్యారని టాక్.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















