Mouni Roy Reveals The Biggest Rumour About Her In Bollywood : బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తనపై వచ్చిన ట్రోలింగ్స్, రూమర్స్‌పై తాాజా ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్‌తో డివోర్స్ తర్వాత తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చినట్లు చెప్పారు.
'నన్ను గే అన్నారు'
సూరజ్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు మౌనీరాయ్. 'డివోర్స్ తర్వాత చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నాపై ట్రోల్స్ చేశారు. నేనొక గే అంటూ కొందరు ప్రచారం చేశారు. నేను విన్న అత్యంత అసంబద్ధమైన, విచిత్రమైన రూమర్ ఇదే.' అని అన్నారు.
'నేను చాలా లక్కీ'
డివోర్స్ తర్వాత తాను ఎంతో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నట్లు చెప్పారు మౌనీ రాయ్. 'విడాకుల తర్వాత ఎంతో క్లిష్టమైన టైం ఎదుర్కొన్నా. ఆ టైంలో నాకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కొండంత అండగా నిలిచారు. అలాంటి స్నేహితులు ఉండడం నిజంగా నా అదృష్టం. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. నా లైఫ్‌లో మంచి, చెడు, అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వారు నన్ను వదిలిపెట్టలేదు. వారు ప్రపంచలోనే బెస్ట్.' అని చెప్పారు.
2022లో సూరజ్‌ను వివాహం చేసుకున్న మౌనీ రాయ్... రీసెంట్‌గానే ఆయనతో విడిపోయారు. పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకున్నారు. వీరి విడాకులకు సంబంధించి రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే... డేవిడ్ ధావన్ దర్శకత్వంలో మౌనీ రాయ్ నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' రీసెంట్‌గానే రిలీజైంది.
Also Read : Chiranjeevi : రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు - మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే?
