Monday Box Office: సడన్‌గా 'యుఫోరియా'కు పెరిగిన కలెక్షన్లు... దుకాణం సర్దేసిన 'బరాబర్ ప్రేమిస్తా' - మండే బాక్సాఫీస్ రిపోర్ట్
Tollywood Box Office - 9th February: గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'యుఫోరియా' సినిమాకు సడన్‌గా సోమవారం కలెక్షన్లు పెరిగాయి. 'బరాబర్ ప్రేమిస్తా' ఆల్మోస్ట్ దుకాణం సర్దేసినట్టే. మండే రిపోర్ట్ చూస్తే...

Telugu Movies Box Office Collection Report: గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'యుఫోరియా'కు ప్రీమియర్స్ తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా స్టార్టింగ్ ఆశించినంత లేదు. మొదటి రోజు ఇండియాలో కేవలం 25 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. శని, ఆది వారాల్లో కూడా థియేటర్ల దగ్గర జనాలు వెలవెలబోయారు. అనూహ్యంగా ఈ సినిమాకు సోమవారం కలెక్షన్లు పెరిగాయి. ఒక్కసారి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూస్తే...
కోటి రూపాయల క్లబ్బులో యుఫోరియా
Sara Arjun's Telugu movie Euphoria collects One Crore Net In India: బాక్స్ ఆఫీస్ బరిలో 'యుఫోరియా' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూసిన జనాలు ఎవరైనా సరే... ఇక మీదట కలెక్షన్స్ రావడం కష్టం అనుకుంటారు. కానీ, మండే ఈ మూవీ మ్యాజిక్ చేసింది. శుక్ర (25 లక్షలు), శని (11 లక్షలు), ఆది (11 లక్షలు) కలెక్ట్ చేసిన ఈ సినిమా... సోమవారం ఒక్క రోజే ఇండియాలో 54 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో ఈ మూవీ కోటి రూపాయల క్లబ్బులో చేరింది.
'ధురంధర్' తర్వాత సారా అర్జున్ తెరపై కనిపించిన సినిమా 'యుఫోరియా'. ఇంకా ఈ సినిమాలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించారు. మంగళ, బుధ వారాల్లో సినిమాకు 25 లక్షలకు పైగా కలెక్ట్ చేస్తే మెల్లగా పికప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
బాక్సాఫీస్‌లో దుకాణం సర్దేసిన సినిమాలు
ఫిబ్రవరి 6న విడుదలైన మిగతా తెలుగు సినిమాల విషయానికి వస్తే... వివాదాలతో వార్తల్లో నిలిచిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ 'బరాబర్ ప్రేమిస్తా' బాక్స్ ఆఫీస్ బరిలో దుకాణం సర్దేసింది. ఆ సినిమాకు సోమవారం లక్ష రూపాయల నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది. దాంతో ఇండియాలో నాలుగు రోజుల నెట్ కలెక్షన్ 69 లక్షలకు చేరుకుంది.
Sumathi Satakam Movie Collection: అమర్ దీప్ చౌదరి 'సుమతి శతకం' చిత్రానికి కూడా సోమవారం కలెక్షన్స్ పెరిగాయి. ఆ చిత్రానికి మండే 19 లక్షల నెట్ వచ్చింది. దాంతో టోటల్ కలెక్షన్ 33 లక్షలకు చేరుకుంది.
నవీన్ చంద్ర 'హానీ' సోమవారం 4 లక్షల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో నాలుగు రోజుల ఇండియా నెట్ కలెక్షన్ 18 లక్షలకు చేరుకుంది. 'శ్రీ చిదంబరం గారు' సినిమాకు సోమవారం 5 లక్షల నెట్ వచ్చింది. దాంతో టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ 31 లక్షలకు చేరుకుంది. 'ఎర్ర చీర', 'లగ్గం' సినిమాలను థియేటర్ల నుంచి తీసేశారు.
సోమవారం కోటికి పైగా రాబట్టిన 'విత్ లవ్'
With Love Movie Four Days Collection: అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'విత్ లవ్' ఫస్ట్ వీకెండ్ రూ. 7.14 కోట్లు కలెక్ట్ చేసింది. శుక్రవారం 1.6 కోట్లు (తమిళంలో రూ. 1.4 కోట్లు, తెలుగులో 20 లక్షలు), శనివారం 2.5 కోట్లు (తమిళంలో 2.20 కోట్లు, తెలుగులో 30 లక్షలు), ఆదివారం రూ. 3.04 కోట్లు (తమిళంలో రూ. 2.68 కోట్లు, తెలుగులో 36 లక్షలు) వచ్చాయి. సోమవారం ఈ సినిమాకు రూ. 1.33 కోట్లు (తమిళంలో రూ. 1.08, తెలుగు రూ. 25 లక్షలు) వచ్చాయి. దాంతో నాలుగు రోజుల కలెక్షన్ రూ. 8.48 కోట్లకు చేరింది.
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు సోమవారం ఇండియాలో 31 లక్షల నెట్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాకు 3 లక్షల నెట్ మాత్రమే వచ్చింది.























