Mohan Lal Slated To Play Crucial Role In Balakrishna Movie : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఈ ఏడాది రెండు బిగ్ ప్రాజెక్టులు చేయనున్నారు. ఇప్పటికే 'వీర సింహా రెడ్డి' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో NBK111 (వర్కింగ్ టైటిల్) చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రెండో ప్రాజెక్ట్ 'సరిపోదా శనివారం' ఫేం వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారు. హై ఆక్టేన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా... ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Continues below advertisement

బాలయ్యతో మోహన్ లాల్

ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయనకు ఏకంగా రూ.35 కోట్లు ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియా బజ్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. హై ఆక్టేన్ గ్యాంగ్ స్టర్ డ్రామాలో సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు మల్టీ స్టారర్స్‌ నటిస్తున్నారన్న వార్త బాలయ్య ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే. మరోవైపు, మెగాస్టార్, బాబీ దర్శకత్వంలో రాబోయే మూవీలోనూ మోహన్ లాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

30 ఏళ్ల తర్వాత...

దాదాపు 30 ఏళ్ల తర్వాత బాలయ్యతో మోహన్ లాల్ కలిసి నటించబోతున్నారు. 1994లో వచ్చిన 'గాంఢీవం' సినిమాలో మోహన్ లాల్ కనిపించారు. ఆ మూవీలో 'గోరువంక వాలగానే గోకులానికి...' పాటలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి డ్యాన్స్ చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు బాలయ్య సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. 

Also Read : బెట్టింగ్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? - ఓటీటీలోకి 'మట్కా కింగ్' వెబ్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీలో వివేక్ ఆత్రేయ బాలయ్యను సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారు. ఆయన మాస్ ఇమేజ్‌ను మరింత పెంచేలా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. NBK112 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'కురుక్షేత్రం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

దసరా నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా... బాలయ్యతో బ్లాక్ బస్టర్ 'వీర సింహా రెడ్డి' తీసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.