Priyadarshi's Mithra Mandali Movie Release Date Locked: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి'. బన్నీ వాస్ సమర్పణలో న్యూ డైరెక్టర్ ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్ సాలిడ్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఆ ఫన్ మరింత రెట్టింపు చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ దీపావళికి నవ్వుల బాంబు

ఈ దీపావళికి మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న మూవీ రిలీజ్ కానుంది. 'ఈ దీపావళికి నవ్వులతో పేలనున్న ఫన్ బాంబు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. టీజర్‌లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ నవ్వులు పూయించగా... పండుగ సందర్భంగా థియేటర్లలో నవ్వుల మోత ఖాయంగా తెలుస్తోంది.

Also Read: అందరికీ RGV... నాకు మాత్రం సైతాన్ - ఒకరు డెవిల్ మరొకరు యానిమల్... వోడ్కాతో వెల్ కం చెప్పిన జగ్గూ భాయ్

ఈ మూవీలో ప్రియదర్శి సరసన ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఈ మూవీతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటే రాగ్ మయూర్, ప్రసాద్ బెహర, విష్ణు ఓయ్, వెన్నెల కిశోర్, సత్య, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా... ఆర్.ఆర్ ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫేమస్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కొత్త బ్యానర్ 'బన్నీ వాస్ వర్క్స్' సమర్పణలో.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తుండగా... సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.