Prabhas : 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం! - ఫ్యాన్స్ ఆందోళన... ఆ వార్తల్లో నిజమెంత?
Prabhas Injury : ఫౌజీ షూటింగ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు గాయం అయ్యిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ దీనిపై ఆందోళన చెందుతుండగా... టీం రియాక్ట్ కావాలని కోరుతున్నారు.

Prabhas Minor Injury On Sets : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు గాయం అయినట్లు ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఫౌజీ' షూటింగ్ సెట్‌లో ఆయనకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ కీలక సీన్ కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ఆయన కింద పడ్డట్లు సమాచారం. ప్రభాస్ చేతిక గాయం అయ్యిందని... అది చిన్నదేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్యాన్స్ ఆందోళన
దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా... ప్రభాస్‌కు గాయం అయ్యిందని తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎలా ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టారు. ప్రభాస్‌కు తగిలిన గాయం చిన్నదేనని... ఆందోళన చెందాల్సిన పని లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆయన టీం రియాక్ట్ కావాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : నాన్న, నేను చావు నుంచి తప్పించుకున్నాం - ఆమె ముందే హెచ్చరించింది... ఆస్ట్రాలజీపై జగపతి బాబు రియాక్షన్
ఇక 'ఫౌజీ' విషయానికొస్తే 'సీతారామం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్‌తో మూవీ చేస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. స్వాతంత్ర్యం ముందు 1930 టైంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. ధర్మం వైపు నిలబడ్డ ఓ యోధుడి కథను చూపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. అయితే, సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అని డైరెక్టర్ హను కన్ఫర్మ్ చేశారు.
సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా... వీరితో పాటే అనుపమ్ ఖేర్, భానుచందర్, జయప్రద, మిథున్ చక్రవర్తి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా... పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























