Meenakshi Chaudhary Reaction About Her Future Husband : తనకు కాబోయే భర్తకు 100 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు యాక్టర్ డాక్టర్ అయి ఉండకూడదని టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పారు.
'బ్రేకప్ ఉన్న పర్వాలేదు'
'మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి?' అంటూ మీనాక్షి చౌదరిని యాంకర్ సుమ ప్రశ్నించగా... తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ ఆమె వివరించారు. '100 ఎకరాల రైస్ ఫీల్డ్, రాజ్మా ఫీల్డ్ ఉండాలి. రాజ్మా నా ఫేవరెట్ డిష్. యాక్టర్, డాక్టర్, మిస్టర్ ఇండియా అయి ఉండకూడదు. నాకు మూవీస్ అంటే ఇష్టం. తనకు కూడా మూవీస్ ఇష్టం ఉంటే బాగుంటుంది. బ్రేకప్ ఉన్నా పర్వాలేదు.
పొడవుగా ఉన్న అబ్బాయి ఉండాలి. లుక్స్ ఎలా ఉన్నా పర్వాలేదు. కచ్చితంగా కుకింగ్ వచ్చి ఉండాలి. నాకు వంట రాదు. రాజ్మా వండడం వస్తే చాలు. బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, ఇంటి పనులు కూడా చేయడం తెలియాలి. జాయింట్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ రోజూ 3 గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇది ఫిక్స్‌డ్.' అంటూ సరదాగా చెప్పారు. ఈ ఆన్సర్స్ విన్న హీరో నవీన్ పోలిశెట్టి... ఇన్ని క్వాలిటీస్ కావాలంటే AIలోనే క్రియేట్ చేయగలమంటూ నవ్వులు పూయించారు.
Also Read : భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ: రవితేజ సినిమా టాకేంటి? ఎన్నారై ఆడియన్స్ ఏమంటున్నారంటే?
పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ప్రధానాంశంగా 'అనగనగా ఒక రాజు' మూవీ రూపొందించారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా... చమ్మక్ చంద్ర, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మారి దర్శకత్వం వహించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి స్పెషల్‌గా బుధవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.