Anupama Parameswaran's Mareechika Trailer Review : పల్లెటూరి అమ్మాయి ఉద్యోగం కోసం సిటీకి వచ్చి ఓ అబ్బాయిని ఇష్టపడుతుంది. తన ప్రేమ విషయం చెప్పే లోపే ఇద్దరి మధ్య ఎన్నారై అమ్మాయి వస్తుంది. ఇదే టైంలో తన లవర్‌ను ఆ అమ్మాయి చంపేసిందంటూ పల్లెటూరి అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. దీంతో పోలీసులకు కన్ఫ్యూజన్.
ఒక పాత్రకు మరో పాత్రకు సంబంధం లేనట్లే ఉంటుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కరి కనెక్షన్ రివీల్ అవుతుంది. అసలు హత్య జరిగిందా? ఎన్నారై అమ్మాయి అబ్బాయిని చంపేసిందా? అసలు వీరి స్టోరీలోకి దెయ్యం ఎంట్రీ ఏంటి? ఇలా ముగ్గురు పాత్రల మధ్య జరిగే ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, సూపర్ సస్పెన్స్‌తో రాబోతోన్న మూవీ మరీచిక. తాజా ట్రైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
పల్లెటూరి అనుపమ
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... వెంకటలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా... మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కీలకపాత్ర పోషించారు. తాజా ట్రైలర్‌తో హైప్ మామూలుగా లేదు.
స్టోరీ మెయిన్ పాయింట్ ఎక్కడా రివీల్ చేయకుండా కేవలం పాత్రల చుట్టూనే సస్పెన్స్ పాయింట్ అల్లారు. ప్రతీ రోల్ చుట్టూ ఓ మిస్టరీ ఉన్నట్లు కనిపించడం స్పెషల్ అట్రాక్షన్. ట్రైలర్ సెకండ్ పార్ట్‌లో మిస్టరీ సీన్స్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సైకలాజికల్, మిస్టరీ అంశాలతో మూవీ రాబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
Also Read : 'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీలో విరాజ్ అశ్విన్, అనుపమ, రెజీనాలతో పాటు అజయ్ ఘోష్ కూడా కీలకపాత్రలో నటించారు. ఈ నెల 29న భారీ స్థాయిలో సినిమా రిలీజ్ చేయనున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మ్యూజిక్ అందించారు.
