Mani Ratnam : మణిరత్నం మూవీలో విజయ్ సేతుపతి! - రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ ఎవరంటే?
Vijay Sethupathi : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ మూవీపై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. రొమాంటిక్ డ్రామా జానర్‌లో మూవీ తెరకెక్కుతుండగా విజయ్ సేతుపతి హీరోగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Director Mani Ratnam Romantic Drama With Vijay Sethupathi : ఎమోషన్, లవ్ ఎంటర్టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. గతేడాది యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 'థగ్ లైఫ్'తో ఆయన ఆడియన్స్‌ను పలకరించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ రొమాంటిక్ డ్రామా చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది.
విజయ్ సేతుపతితో...
తాజాగా ఈ రొమాంటిక్ డ్రామాపై లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. తొలుత ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ శింబుతో తీస్తారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ ఎవరంటే?
ఈ రొమాంటిక్ డ్రామాలో విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా చేయబోతున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... ఈ మూవీకి ఆయన సాంగ్స్ కూడా కంపోజ్ చేయడం కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : 'ది ప్యారడైజ్' ఆయా షేర్ ప్రోమో - హై ఎనర్జీ మాస్ బీట్‌తో జాతరే
స్టోరీ లైన్ అదేనా?
చెన్నైలోని పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ జరగనున్నట్లు తెలుస్తుండగా... బ్యూటిఫుల్ లవ్ స్టోరీ టచ్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. సిటీ అమ్మాయికి, పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగే లవ్ స్టోరీనే మూవీ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది. కేవలం తమిళంలోనే తెరకెక్కించి ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ స్లమ్ డాగ్‌లో నటిస్తున్నారు. తమిళంలోనూ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. అవన్నీ పూర్తైన తర్వాత మణిరత్నం మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ 'రామాయణ'లో సీతాదేవిగా నటిస్తున్నారు. త్వరలోనే మణిరత్నం మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
























