Sri Kalahasti Song Promo From Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మరో డివోషనల్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించగా.. వారు 'శ్రీకాళహస్తి' గొప్పతనాన్ని వివరిస్తూ పాట పాడారు. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా పూర్తి పాటను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు.
వారు పాడిన పాటే..
మూవీలో ఈ పాటను మంచు విష్ణు కుమార్తెలే పాడారు. 'జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీకాళహస్తి గాథ..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా.. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: హరిహర వీరమల్లు నిర్మాతలకైనా అదే వర్తిస్తుంది-సంచలన ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
మూవీ టీంకు షాక్
ఇంకో నెల రోజుల్లో మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. మంచు విష్ణు ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంతలోనే మూవీ టీంకు షాక్ తగిలింది. మూవీకి సంబంధించి కీలక సన్నివేశాలున్న హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యింది. ముంబయిలోని వీఎఫ్ఎక్స్ సంస్థ కొన్ని సీన్స్ రూపొందించగా.. ఆ హార్డ్ డ్రైవ్‌ను డీటీడీసీ ద్వారా కొరియర్ చేశారు. అది అందకపోవడంతో ఆరా తీయగా ఆఫీస్ బాయ్ రఘు, సిబ్బంది చరిత దాన్ని మాయం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లీకైతే భారీ నష్టమే..
మిస్ అయిన హార్డ్ డ్రైవ్‌లో 1:30 గంటల సినిమా ఉందని మూవీ టీం ఫిర్యాదులో పేర్కొంది. ఈ కంటెంట్ లీక్ అయితే మాత్రం భారీ నష్టమే అని తెలుస్తోంది. ప్రభాస్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్ అన్నీ ఇందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రభాస్ లుక్ సహా ఇతర అంశాలపై మూవీ టీం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రభాస్, మోహన్ బాబు మధ్య యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఇదివరకే ఇంటర్వ్యూల్లో చెప్పారు మంచు విష్ణు.
కానీ.. ఇప్పుడు హార్డ్ డ్రైవ్‌లో సీన్స్ లీకైతే మూవీపై ఆసక్తి తగ్గిపోతుందంటూ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు సినిమాలో సగ భాగం వరకూ ఈ హార్డ్ డ్రైవ్‌లోనే ఉందనే టాక్ వినిపిస్తోంది. బ్యాకప్ ఉన్నా మిస్ అయిన కంటెంట్ ఆన్‌లైన్‌లో లీకైతే కష్టమేనని అంటున్నారు. పోలీసులు హార్డ్ డిస్క్ వెతికే పనిలో ఉన్నారు.
మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత 'కన్నప్ప'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.