Chiranjeevi's Sasirekha Song Release Date: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie). ఆల్రెడీ 'మీసాల పిల్ల' సాంగ్ విడుదలైంది. ఆ టీమ్ ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి రెడీ అయ్యింది.
డిసెంబర్ 8న 'శశిరేఖ'...6న సాంగ్ ప్రోమో రిలీజ్!Mana Shankara Vara Prasad Garu's 2nd single release date: 'మీసాల పిల్ల...' తర్వాత నయనతారను 'శశిరేఖా...' అంటూ పిలవతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో రెండో పాట 'శశిరేఖ'లో హీరో హీరోయిన్స్ లుక్స్ సైతం విడుదల చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... 'మీసాల పిల్లా'తో కంపేర్ చేస్తే, 'శశిరేఖ'లో ఇద్దరి లుక్స్ అదిరిపోయాయి.
డిసెంబర్ 8వ తేదీన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలోని రెండో పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అంత కంటే ముందు... ఈ శనివారం (డిసెంబర్ 6న) సాంగ్ ప్రోమో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!
సంక్రాంతి బరిలో సినిమా!MSG Movie Release Date: దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి పండగ బాగా కలిసి వచ్చింది. పెద్ద పండక్కి విడుదలైన ప్రతి సినిమా విజయం సాధించింది. ఈ 'మన శంకర వర ప్రసాద్ గారు'ను సైతం సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ అధినేత సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత్రి - చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కేథరిన్ త్రేసా, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.