Malayalam Directors Khalid Rahman Ashraf Hamza Arrested In Ganza Case: మలయాళం డైరెక్టర్లు ఖలీద్ రెహమాన్ (Khalid Rahman), అష్రఫ్ హమ్జాలను (Ashraf Hamza) గంజాయి కేసులో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఓ ప్లాట్‌లో స్నేహితులతో కలిసి గంజాయి తీసుకునేందుకు రెడీ అవుతుండగా.. అర్ధరాత్రి 2 గంటలకు అధికారులు దాడి చేసి వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పక్కా సమాచారంతోనే..
పక్కా సమాచారంతోనే దాడి చేశామని.. ఇద్దరు మలయాళ డైరెక్టర్లతో పాటు వారి స్నేహితుడి వద్ద రూ.1.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ ఆ ప్లాట్ అద్దెకు తీసుకున్నారని ఓ అధికారి వెల్లడించారు. 'మేము కొచ్చిలోని ఓ ఫ్లాట్ నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకుని హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985లోని సెక్షన్లు 20(b) (II) A, 29 కింద కేసు నమోదు చేశాం' అని పేర్కొన్నారు. ఓ మూవీకి సంబంధించి చర్చల కోసం ప్లాట్‌కు వచ్చినట్లు తెలిపారు.
దర్శకులకు డ్రగ్స్ సరఫరా చేసిన వారి గురించి ఆధారాలు దొరికాయని.. దీనిపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. సినీ రంగంలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం ఉందని.. దానిపై కూడా ఎంక్వైరీ జరుపుతామని చెప్పారు. ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది.
Also Read: కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
బెయిల్‌పై రిలీజ్
వీళ్ల ముగ్గురినీ అరెస్ట్ చేసి.. బెయిల్‌పై విడుదల చేశారు. ఎక్కువ మొత్తంలో దొరక్కపోవడంతో బెయిల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గంజాయి వాడకంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఖలీద్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'జింఖానా' ఈ నెల 25న తెలుగులో రిలీజ్ అయ్యింది. అలాగే, ఉండ, తల్లుమాల, అనురాగ కరికిన్ వెళ్లం, లవ్ వంటి హిట్ మూవీస్ డైరెక్ట్ చేశాడు. అష్రఫ్ హమ్జా.. తమాషా, భీమ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. తల్లుమాల సినిమాకు సహ రచయితగా వ్యవహరించారు.