మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార (Salim Kumar)ను శనివారం ఉదయం ఆస్పత్రిలో చేర్పించారు. అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కొచ్చిలోని ఒక ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

వెంటిలేటర్ మీద సలీం కుమార్...విషమంగా మలయాళ నటుడి పరిస్థితిప్రస్తుతం సలీం కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పుడు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి, వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. శనివారం ఉదయం సలీం కుమార్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. 

కాలేయ సంబంధిత సమస్యలతో కొన్ని సంవత్సరాలుగా సలీం కుమార్ సతమతం అవుతున్నారు. ఆయన లివర్ సిరోసిస్ బారిన పడ్డారు. గతంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా జరిగింది. ఆ విషయాన్ని సందర్భాల్లో ఆయన స్వయంగా చెప్పారు. ఆరోగ్య సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం కూడా తగ్గించారు. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.

Continues below advertisement

Also Read: Buchi Babu Sana On Objectifying Janhvi Kapoor Role - సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్

సలీం కుమార్ కెరీర్ విషయానికి వస్తే... మిమిక్రీ కళాకారుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత నటుడిగా మలయాళ చిత్రసీమలో అడుగు పెట్టి అగ్ర నటుడిగా ఎదిగారు. 'ఇష్టమాను నూరు వట్టం' (1997)తో ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. 'కళ్యాణరామన్', 'పంజాబీ హౌస్', 'సిఐడి మూసా', 'ఈ పరక్కుమ్ తలిక' వంటి బ్లాక్‌ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆయన వినోదానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కామెడీ రోల్స్ చేసిన కొన్నాళ్ళకు సీరియస్ క్యారెక్టర్లలో కనిపించి ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'ఆదామింటే మకాన్ అబు' (2010)లో ఆయన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అలాగే, 'అచనురంగాత వీడు'కు గాను కేరళ స్టేట్ అవార్డు కూడా వరించింది.

Also ReadJr NTR Cookies News - అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్

సినిమాల్లోకి సలీం వారసుడు చందుSalim Kumar Son Chandu: సలీం కుమార్ తనయుడు చందు సలీం కుమార్ కూడా తండ్రి బాటలో నడుస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 'మాలిక్', 'మంజుమ్మెల్ బాయ్స్'లో నటించారు.

సలీం కుమార్ సినిమాల్లో నటించడమే కాదు... రాజకీయ ప్రచార కార్యక్రమాల్లోనూ తన గళాన్ని వినిపించారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు మద్దతుగా ప్రచారం చేశారు. గతేడాది 'ఆజాదీ', 'భా భా బా' చిత్రాల్లో కనిపించారు.

Also ReadVaranasi Rama vs Kumbhakarna War - రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి