Mohanlal Mother Passed Away : మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంత కుమారి (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుది శ్వాస విడిచారు.

Continues below advertisement

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టి దంపతులు మోహన్ లాల్ నివాసానికి వెళ్లి శాంతకుమారి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

Also Read : కన్నడ సీరియల్ నటి నందిన ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Continues below advertisement

తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్ లాల్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని అన్నారు. రీసెంట్‌గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న టైంలో ఫస్ట్ తన తల్లితోనే ఆనందాన్ని పంచుకున్నట్లు వెల్లడించారు. శాంతకుమారి భర్త, మాజీ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథన్ నాయర్ 2005లో కన్నుమూశారు.