రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలో ఓ కథానాయికగా నటించిన మాళవికా మోహనన్ (Malavika Mohanan) గుర్తు ఉన్నారా? ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ఆవిడ హాజరయ్యారు. అక్కడ తమిళ మీడియా నుంచి సీఎం జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) గురించి అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది. ప్రశ్నలో పదాలు సాధారణంగా కనిపించవచ్చు కానీ అందులో అర్థం మాత్రం వేరుగా ఉంది.
త్రిష టైపులో ఎలా ట్రావెల్ చేయాలో మీకు తెలుసా?Vijay Trisha Latest News: విజయ్ - త్రిష మధ్య సాన్నిహిత్యం గురించి తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. తన భర్తకు ఓ నటితో సంబంధం ఉంది కనుక విడాకులు కోరారు సంగీత. అది బయటకు వచ్చిన తర్వాత త్రిషతో కలిసి ఓ పెళ్ళికి హాజరయ్యారు విజయ్. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు త్రిష. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ విషయాలను పరోక్షంగా ప్రస్తావించారు ఓ తమిళ జర్నలిస్ట్.
'విజయ్ (Thalapathy Vijay)తో కలిసి త్రిష కృష్ణన్ పలు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆయనతో ఎలా ట్రావెల్ చేయాలో మీకు తెలుసా? మీకు అవగాహన ఉందా?' అని మాళవికను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆయనతో ఎలా రిలేషన్‌లోకి వెళ్లాలో తెలుసా? అని అంతరార్థం. ఆ ప్రశ్నకు వెంటనే అసహనం వ్యక్తం చేశారు మాళవిక. ''మీరు నన్ను ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు?' అని ఎదురు ప్రశ్నించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో మరోసారి 'ఎక్స్'లో ఆవిడ రియాక్ట్ అయ్యారు.
గౌరవప్రదంగా వ్యవహరించండి!సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్' (ట్విట్టర్)లో మాళవికా మోహనన్ ఓ ట్వీట్ చేశారు. ''తమిళ మీడియా, జర్నలిస్టుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే కొందరు కావాలని సంచలనం కోసం ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు విజయ్ ఏడు సంవత్సరాలుగా తెలుసు. ఆయన నాకో మంచి ఫ్రెండ్. భవిష్యత్తులో నటీనటులను మీడియా ప్రశ్నలు అడిగేటప్పుడు గౌరవప్రదంగా వ్యవహరించాలి. విజ్ఞతతో ఉండాలి. ఇది అందరికీ మంచిది'' అని మాళవిక చెప్పారు.
Also Read: Ravi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'మాస్టర్' (2021)లో విజయ్, మాళవికా మోహనన్ కలిసి నటించారు. ప్రస్తుతం విజయ్ సీఎం. ఆయన రాజకీయ ప్రయాణంతో పాటు వ్యక్తిగత విషయాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా త్రిషతో సంబంధం గురించి. వాళ్ళిద్దరి గురించి ఇతరులను ప్రశ్నించడం ఎంత వరకు సబబు? అనేది ఇక్కడ ప్రశ్న. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై మీడియా పరిధులు దాటకూడదని మాళవికా మోహనన్ స్పష్టం చేశారు.
