New Poster Unveil From Suriya Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్‌ మూవీ 'కంగువా'. డైరెక్టర్ శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని మూడు నెలలు అవుతుంది. ఇంకా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు. చూస్తుంటే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని స్లో స్లోగా జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. షూటింగ్‌ అయిపోయినా ఇంకా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ 'కంగువ' విషయంలో ఆందోళన చేందుతున్నారు. అంతేకాదు మూవీ రిలీజ్‌పై కూడా రకరకాల పుకార్లు వినిపిస్తన్నాయి.


'కంగువా' నెక్ట్స్‌ ఇయర్‌ రిలీజ్‌ అవుతుందంటూ రూమర్లు వస్తున్నాయి. ఓవైపు ప్రచార పోస్టర్స్‌, సూర్య లుక్‌, టీజర్‌ ఇలా విడుదల చేసి మూవీపై అంచనాలు పెంచుస్తుంది మూవీ టీం. కానీ రిలీజ్‌ డేట్‌పై మాత్రం అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. దీంతో కంగువ రిలీజ్‌ తేదీ కోసం మూవీ లవర్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కంగువ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ఈ రిలీజ్‌పై క్లారిటీ ఇస్తూ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో సూర్య మోడ్రన్‌ మనిషిలా, మరోవైపు యుద్ధవీరుడిలా కనిపించాడు. ఈ రెండు పాత్రలను ఎదురేదురుగా చూపిస్తూ డిజైన్‌ చేసిన పోస్టర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది.






ఇక ఈ సినిమా 2024లోనే విడుదల అవుతుందని  స్పష్టం చేశారు. కానీ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. అంటే ఇంకా ఈ సినిమా కోసం వేయిట్‌ చేయక తప్పదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా రిలీజ్‌ పోస్టర్‌ మాత్రం చాలా ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు దీనిపై మేకర్స్‌ ఇచ్చిన అప్‌డేట్‌ చూస్తుంటే ఈ సినిమా 'బింబిసార' టైం ట్రావెలర్‌ మూవీగా అనిపిస్తుంది. వన్‌సైడ్‌ సూటు, బూటుతో.. తుపాకితో సూర్య, మరోవైపు యుద్దవీరుడిలా కత్తితో మరో సూర్య ఇద్దరు తలపడుతున్నట్టుగా చూపించారు. ఇక దీనికి "గతం, వర్తమానం ఢీకొన్న చోటే కొత్త భవిష్యత్తు ప్రారంభమవుతుంది" అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చారు. అలాగే 2024లో 'కంగువా' వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుందంటూ మేకర్స్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.



మొత్తానికి కొత్త పోస్టర్‌తో ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచారు మేకర్స్‌. చూస్తుంటే ఈ సినిమాలో ఒకేసారి గతం, వర్తమానం కలిపి ఉంటుందనిపిస్తుంది. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ అని ఈ పోస్టర్‌తో అర్థమైపోతుంది. అయితే ఈ చిత్రంలో సూర్య ఐదు విభిన్న పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణసంస్థలు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ వరల్డ్ చిత్రంగా ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. 


Also Read: 'సలార్‌'కే చెమటలు పట్టించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ, ఇప్పుడు ఓటీటీకి - సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 'కాటేరా'