Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Varanasi Update : మహేశ్ బాబు వారణాసి మూవీ మరోసారి లీకుల బారిన పడినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తుండగా యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయినట్లు ప్రచారం సాగుతోంది.

Rajamouli's Varanasi Has Once Again Fallen Victim To Leaks : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో విజువల్ వండర్ 'వారణాసి' ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ మరోసారి లీకుల బారిన పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అదేంటీ అని తెగ సెర్చ్ చేస్తున్నారు.
యాక్షన్ సీన్
సినిమాలో ఓ కీలక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా... దానికి సంబంధించిన ఫోటోస్, వీడియోలు లీక్ అయినట్లు ప్రచారం సాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని చెరువులో కీలక బోట్ సీక్వెన్స్ చేస్తుండగా... అది లీక్ అయ్యిందంటూ టాక్ వినిపిస్తోంది. ఇది వారణాసి షూటింగ్ వీడియో అంటూ కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనూ మూవీకి సంబంధించిన మహేశ్ బాబు యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయ్యింది. అప్పట్లో టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
'రాజమౌళికే తప్పడం లేదు'
సాధారణంగా రాజమౌళి మూవీ షూటింగ్ అంటే మామూలుగా ఉండదు. రెండింతల సెక్యూరిటీతో ఉంటుంది. సెట్‌లోకి వెళ్లేటప్పుడు హీరోతో పాటు అందరూ ఫోన్ బయట ఉంచి వెళ్లాల్సిందే. ఓ చిన్న ఫోటోను కూడా జక్కన్న బయటకు వెళ్లనివ్వరు. అంతటి దర్శకధీరుడి మూవీకి కూడా లీకుల బెడద తప్పడం లేదని నెట్టింట చర్చ సాగుతోంది.
టైటిల్ గ్లింప్స్ రిలీజ్ టైంలోనూ అఫీషియల్‌గా రిలీజ్ చేయక ముందే మహేశ్ లుక్, టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. భారీ స్క్రీన్‌పై వీడియోను టెస్ట్ చేస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా డ్రోన్లతో షూట్ చూసి లీక్ చేశారంటూ.. తర్వాత స్టేజీపై జక్కన్న ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి షూటింగ్ టైంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయినా లీకుల బెడద తప్పలేదు.
Also Read : 10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
స్టోరీ అదేనా?
రెండు రోజుల క్రితం వారణాసి ప్లాట్ ఇదే అంటూ ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్న ఓ VFX సంస్థ తన వెబ్ సైట్‌లో కథను సంక్షిప్తంగా మెన్షన్ చేసింది. టైమ్ ట్రావెల్, ప్రపంచ అన్వేషణ ప్రధానాంశంగా ఈ మూవీ రూపొందుతున్నట్లు రాజమౌళి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'శివ భక్తుడు (మహేశ్ బాబు) కాలాన్ని ఎదిరించే ఓ ప్రమాదకర సాహస యాత్రకు బయలుదేరుతాడు. ఓ అపురూపమైన, అపార శక్తి కలిగిన విశ్వ కళాఖండం కనుగొనాలనేదే అతని లక్ష్యం.
ఈ అన్వేషణలో ప్రాచీన రహస్యాలను ఒకదానితో ఒకటి జోడించుకుంటూ ముందుకు సాగుతాడు. అప్పుడే ఈ మిషన్ వెనుక ఓ కుట్ర దాగి ఉందని అతనికి తెలుస్తుంది. తనను ఈ దిశగా నడిపించడం వెనుక ఇంటెలిజెన్స్ మైండ్ రణ కుంభ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఉన్నాడని అర్థమవుతుంది. ఆ తర్వాత శివభక్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? విశ్వాన్ని శాసించే శక్తిని శత్రువుల పాలు కాకుండా ఎలా అడ్డుకున్నాడు? దైవ శక్తి చేసిన సహాయం ఏంటి?. అనేదే వారణాసి స్టోరీ.' అని తెలిపింది.
మరోవైపు, మూవీ షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రియాంక చోప్రా, మహేశ్ బాబుపై సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. అటు, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ పార్ట్ పూర్తైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా వరల్డ్ వైడ్ రిలీగ్ కానుంది.
ట్రెండింగ్ వార్తలు





















