Mahesh Babu Vacation Trip To Colombo: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనతో ఒక్కసారైనా సెల్ఫీ దిగాలని చాలామంది ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. ఎయిర్ పోర్టుల్లో ఎప్పుడైనా వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మహేష్ కూడా ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగుతుంటారు. తీరిక దొరికనప్పుడల్లా వెకేషన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసే మహేష్... తాజాగా కొలంబో వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ లైన్స్ సిబ్బందితో దిగిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మహేష్ బాబు హైదరాబాద్ నుంచి కొలంబోకు జర్నీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది ఆయనతో ఫోటో దిగారు. 'సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఘన స్వాగతం పలికే ఆనందం మాకు కలిగింది. ఇంతటి గొప్ప అతిథికి మా విమానంలో ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారు. మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు సార్.' అంటూ బెస్ట్ ఫోటో మూమెంట్‌ను తమ అధికారిక 'X' హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ లుక్ వైరల్ అవుతోంది.
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో...
ఈ ఫోటోలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో సూపర్ స్టార్ అదరగొట్టారు. కొత్త మూవీ 'ఎస్ఎస్ఎంబీ29'లోనిదే ఈ లుక్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లుక్ సూపర్ అని... విదేశాల్లోనూ మహేష్ క్రేజ్ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు... స్టేజీపై 'వీరమల్లు' - పవన్ లుక్స్ అదుర్స్... వాచ్ ధర ఎంతో తెలుసా?
'SSMB29' లేదా వెకేషన్ కోసమా?
మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29' మూవీలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మహేష్ తాజాగా కొలంబో వెళ్లింది మూవీ షూటింగ్ కోసమా లేక వెకేషన్ కోసమా అనేది క్లారిటీ లేదు. ఒడిశా, హైదరాబాద్‌లో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు జక్కన్న.
కెన్యాలో కొత్త షెడ్యూల్ జరుగుతుందని భావించినప్పటికీ అక్కడ ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా తూర్ఫు ఆఫ్రికా, టాంజానియాలో కొత్త షెడ్యూల్ షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం అక్కడ నేచర్ ప్లేసెస్, ఎత్తైన కొండలను టీం పరిశీలిస్తోందట. ఆగస్టులో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే ఓ సాహస ప్రయాణంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 'రామాయణం'లోని సంజీవని శోధనతో పాటు సాహసోపేతమైన జర్నీ ఉంటుందని... ఇప్పటివరకూ ఎవరూ చూడని ప్రపంచాన్ని జక్కన్న సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణన్ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.