Varanasi Promotions : గ్లోబల్ లెవల్ 'వారణాసి' - ఏడాది ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన స్టార్స్
Mahesh Babu : ఏడాది ముందే రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

Mahesh Babu Priyanka Chopra Promotions For Rajamouli Varanasi Movie : యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ మూవీ ఏ జానర్? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మహేష్ బాబు రోల్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఒక్క వీడియోతోనే ఆన్సర్ ఇచ్చారు జక్కన్న. రాబోయే రోజుల్లో మరిన్న సర్‌ప్రైజెస్ ఖాయంగానే కనిపిస్తోంది.
ఈ మూవీ 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ కోసమే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి 100 అడుగుల బిగ్ స్క్రీన్‌పై వీడియో ప్లే చేశారు. ఫస్ట్ అప్డేట్‌కే ఇంత హడావిడి చేస్తే ఇక మూవీ రిలీజ్‌కు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే' అంటూ మహేష్ చెప్పడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఏడాది ముందే
'వారణాసి' కోసం ఏడాది ముందే మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. GlobeTrotter ఈవెంట్‌లోనే ఒక్కొక్కరు తమ స్పీచ్‌తో మూవీ ఎలా ఉంటుందో ముందే చెప్పేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి డైరెక్టర్ రాజమౌళి, మహేష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇలా అందరి మాటలతోనే స్కై హైప్ క్రియేట్ కాగా... గ్లింప్స్ వీడియో దాన్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కో కథను ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి... డాటెడ్ లైన్‌గా మహేష్ క్యారెక్టర్ రుద్రను చూపించారు.
తాజాగా ప్రియాంక చోప్రా మహేష్, పృథ్వీరాజ్‌లతో దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. 'తెలుగు, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన ఈ ఇద్దరు లెజెండ్లతో వర్క్ చేయడం అది కూడా రాజమౌళి సినిమా కోసం కలవడం నాకు దక్కిన గౌరవం. మూవీ రిలీజ్‌కు ఏడాది ముందే ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ల రియాక్షన్స్, పెరుగుతున్న అంచనాలు ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి. దేవుని దయతో మీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతాం. జై శ్రీరామ్' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
ఈ మూవీలో హీరోగా రుద్ర క్యారెక్టర్‌లో మహేష్ బాబు, హీరోయిన్‌గా మందాకిని పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలన్ 'కుంభ'గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే అందరి లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మూవీలో ఇతర క్యారెక్టర్స్ రోల్స్ వెల్లడించలేదు. ఈ క్రమంలో అటు సోషల్ మీడియా వేదికగా ముగ్గురూ అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. GlobeTrotter ఈవెంట్‌కు ముందే వీడియోలతో హల్చల్ చేయగా... ఇప్పుడు మరింత జోష్ నింపేలా ముగ్గురూ ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్‌కు ఏడాది ముందే ప్రమోషన్స్‌పై దృష్టి పెడుతుండడంతో ఇంటర్నేషనల్ స్థాయిలో 'వారణాసి' హైప్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 'NBK111'లో నయనతార ఫస్ట్ లుక్ - బాలయ్య ఎంపైర్‌లోకి పవర్ ఫుల్ క్వీన్ ఎంట్రీ
'వారణాసి' గ్లింప్స్ హైలెట్స్
సృష్టి ఆవిర్భావం నుంచి వారణాసి పుట్టుక రహస్యం, ఆస్టరాయిడ్ తాకడంతో అంటార్కిటికా ఖండంలో మంచు కరిగిపోవడం, ఆప్రికాలోని వన్య మృగాలు సంచరించే అంబుసలి వైల్డర్ నెస్, వానాంచల్ ఉగ్రభట్టి గుహలో చిన్న మస్తా దేవి, త్రేతా యుగం, మణికర్ణిక ఘాట్ ఇలా అన్నింటికీ రుద్రుడిని లింక్ పెట్టనున్నారు రాజమౌళి. ఇంతకు ముందు మూవీ కేవలం యాక్షన్ అడ్వెంచర్ జానర్ అనే ప్రచారం ఉండేది. గ్లింప్స్ వీడియో తర్వాత మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. జక్కన్న ఐడియా ఏంటి? అసలు స్టోరీ ఏంటి? అనేది ఊహకు కూడా అందడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ విజువల్ వండర్ సిల్వర్ స్క్రీన్‌పై రావాలంటే 2027 వరకూ ఆగాల్సిందే.





















