Mahesh Babu Namrata Birthday Wishes To Sitara: తమ ముద్దుల కుమార్తె సితారకు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెష్ చెప్పారు. 'ఆమె ఓ టీనేజర్. నా జీవితాన్ని ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉంటుంది. లవ్ యూ సో మచ్ సితార. పుట్టిన రోజు శుభాకాంక్షలు.' అంటూ మహేష్ తన కుమార్తెతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు.

క్యూట్ ఫోటోస్ షేర్ చేసిన నమ్రత

మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా కుమార్తె సితారకు ప్రత్యేకంగా విషెష్ చెప్పారు. సితార చిన్నప్పటి క్యూట్ ఫోటోస్ షేర్ చేసిన నమ్రత... 'నువ్వు ఎంత పెద్దదానివైనా నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన చిన్న చేయివి నువ్వే. పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యూ సితార.' అంటూ రాసుకొచ్చారు. ఆమె చిన్నప్పటి ఫోటోస్‌ను చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సితార... సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తెగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తండ్రి, తల్లితో బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటుంటారు. చిన్న ఏజ్‌లోనే ఓ పెద్ద యాడ్ చేసి సంచలనం సృష్టించారు. ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించి ప్రమోట్ చేశారు. ట్రెడిషనల్ డ్రెస్ వేర్‌లో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Also Read: ప్రొడ్యూసర్ ఎఎం రత్నంపై డిస్ట్రిబ్యూటర్స్ కంప్లైంట్ - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు ముందే...

సితార గొప్ప మనసు

అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో ఉన్న టైమ్ స్క్వేర్‌పై ఈ యాడ్ మెరవడంతో స్టార్ కిడ్ సితార ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. తన ఫస్ట్ రెమ్యునరేషన్ ఓ చారిటీకి ఇచ్చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మహేష్ బాబు దంపతులు ఎందరో చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ను చారిటీలకు ఇచ్చి సితార కూడా తండ్రికి తగ్గ కూతురిగా అందరి మన్ననలు పొందారు. వీటితో పాటే తన తండ్రితో కలిసి 'సర్కారు వారి పాట' సినిమాలో గెస్ట్ ఎపియరెన్స్ ఇచ్చారు సితార. అలాగే ఓ బ్రాండ్ దుస్తుల యాడ్‌లోనూ ఇద్దరూ కలిసి కనిపించారు. 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను నిజం చేస్తూ తన సింప్లిసిటీని పలు సందర్భాల్లో చాటుకున్నారు. తన తల్లితో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లిన సితార వేదికపైకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వృద్ధులకు తన చేయి అందించి సాయం చేశారు. అలాగే, చిన్నారులకు కూడా సాయం అందించారు.