టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో సితార కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా సితార ఓ రేర్ రికార్డుని క్రియేట్ చేసింది. తాజాగా ఆమె ఏకంగా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ తండ్రికి తగ్గ కూతురు అంటూ సితారపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


ఇటీవల ఈ సంస్థ  సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించి రీసెంట్గా యాడ్ షూట్ కూడా చేశారు. ఇక ఈ యాడ్ ని ఏకంగా న్యూయార్క్ సిటీ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది. సితార యాడ్ అలా న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శితం అవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరకు మహేష్ ట్వీట్ చేస్తూ.. "సితారని టైం స్క్వేర్ పై చూడడం ఆనందంగా, గర్వంగా ఉంది. ఇలాగే కొనసాగుతూ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలి" అని పేర్కొన్నారు.


కాగా అటు మహేష్ అభిమానులు సైతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టైం స్క్వేర్ లో సితారని ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, చిన్న వయసులో సితారకి దక్కిన గొప్ప గౌరవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జులై 4 న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సితార కు సంబంధించిన ఈ ఫోటోలను టైమ్స్ స్క్వేర్ పై ప్రదర్శించారు. ఇక ఈ అరుదైన ఘనతతో సితార మరోసారి సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఇక సితార విషయానికొస్తే.. ఇప్పటికే తన డాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. అలాగే తన తండ్రి మహేష్ బాబు తో కలిసి పలు టీవీ షోకి కూడా అటెండ్ అయింది. గత ఎడాది మహేష్ నటించిన 'సర్కార్ వారి పాట'లో ఓ సాంగ్లో గెస్ట్ అపీరియన్స్ తో ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా దిల్ రాజు కొడుకు బర్త్‌డే ఈవెంట్ లో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.


ఇక మహేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ గ్లిమ్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టింది. మహేష్ కి జోడిగా శ్రీ లీల హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.