Mahesh Babu - Namrata Wedding Anniversary: టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకోని రోజుల్లోనే మహేశ్ బాబు, నమ్రత పెళ్లి ఒక సెన్సేషన్‌గా మారింది. అప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించి యూత్‌కు క్రష్‌గా మారిపోయాడు మహేశ్ బాబు. అదే సమయంలో నమ్రతను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఒక స్టార్ హీరో ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడమేంటి అని ఆశ్చర్యపోయారు. పెళ్లికి ముందు నమ్రత కూడా హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా.. పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ అయిపోయారు. మహేశ్ బాబు సినిమాల బాధ్యతను చూసుకుంటూ.. ఇప్పుడు పిల్లల బాధ్యతను కూడా తనపైనే వేసుకున్నారు. 2024 ఫిబ్రవరీ 10న మహేశ్, నమ్రత.. తమ 19వ పెళ్లిరోజును జరుపుకుంటున్నారు.


అయిదేళ్లు డేటింగ్..


‘వంశీ’ అనే సినిమాలో మహేశ్ బాబు, నమ్రత కలిసి నటించారు. అదే సమయంలో ముందుగా మహేశ్ బాబుకు నమ్రతపై ప్రేమ కలిగింది. ఆ ప్రేమ గురించి తను బయటపెట్టిన తర్వాత వీరిద్దరూ దాదాపుగా అయిదు సంవత్సరాలు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మహేశ్ బాబు.. తనను మొదట కలిసినప్పుడు చాలా మర్యాదపూర్వకంగా, అమాయకంగా కనిపించాడని, ఇప్పటికీ అలాగే ఉన్నాడని నమ్రత పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఇతర సెలబ్రిటీ కపుల్‌లాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలు షేర్ చేయరు. వీరి పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎక్కువగా బయటపెట్టరు. ఎవరి ప్రొఫెషన్‌లో వారు బిజీగా ఉంటారు. అదే వీరిని స్పెషల్ కపుల్‌ను చేసింది.


ఫ్యామిలీ మ్యాన్..


పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పినా.. మహేశ్ మూవీ బాధ్యతలన్నీ తానే చూసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవి పూర్తిగా నిజం కాదని నమ్రత ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్‌లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఎవరు అంటే మహేశ్ బాబు అనే చెప్తారు. ఎందుకంటే తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కచ్చితంగా ఫ్యామిలీకి కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తాడు మహేశ్. ఏడాదికి మహేశ్ వెళ్లినన్నీ హాలీడేస్ ఇంకా ఏ ఇతర హీరోలు వెళ్లడు అని ప్రేక్షకులకు కూడా తెలుసు. మహేశ్, నమ్రత.. తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన హాలీడేస్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు. నార్త్‌లో పుట్టి, పెరిగిన నమ్రతకు తెలుగు రాకపోయినా మహేశ్ కోసం నేర్చుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని ఒక సందర్భంలో బయటపెట్టారు.


పెళ్లికి ముందే కండీషన్..


మహేశ్ బాబు కోసమే తాను పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యానని నమ్రత రివీల్ చేశారు. పెళ్లికి ముందే ఈ విషయంలో క్లియర్‌గా ఉన్నామని చెప్పుకొచ్చారు. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే పెండింగ్‌లో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేసేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇప్పటికే రాజమౌళి సినిమా కోసం జర్మనీ వెళ్లి అడవుల్లో తిరిగేసి వచ్చారు మహేశ్ బాబు. అందుకే 19వ యానివర్ససీని ఇంట్లోనే జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు, నమ్రత వారసుల్లో సితార.. పెద్దయ్యాక హీరోయిన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ట్రైనింగ్ మొదలుపెట్టింది. గౌతమ్ మాత్రం ఫారిన్‌లో తన చదువు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.


Also Read: సితారనూ వదలని దుండగులు - పోలీసులను ఆశ్రయించిన నమ్రత శిరోద్కర్