నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'మాచర్ల నియోకవర్గం'. ఇందులో ఆయన కలెక్టర్ రోల్ చేస్తున్నారు. కలెక్టర్ అంటే క్లాస్ అనుకోవద్దు. 'మీకు నచ్చే మాస్‌తో వస్తున్నా' అంటూ ముందుగానే సినిమా జానర్ ఏంటనేది నితిన్ చెప్పేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే... షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? విడుదల ఎప్పుడు? అనే విషయాలు కూడా వెల్లడించారు.


'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.


Macherla Niyojakavargam Movie Shooting Update: ఒక్క పాట మినహా 'మాచర్ల నియోజకవర్గం' షూటింగ్, ఫస్టాఫ్ రీ రికార్డింగ్ కంప్లీట్ అయ్యిందని... పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆల్రెడీ యూరప్‌లో అందమైన లొకేషన్లలో ఒక పాటను తెరకెక్కించమని చెప్పారు. అందులో స్టిల్ ఇది.


రాజ‌కీయ నేప‌థ్యంలో కమర్షియల్ హంగులతో 'మాచర్ల నియోజకవర్గం' తెరకెక్కుతోంది. గుంటూరు జిల్లాలో ఓ యువ కలెక్టర్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది సినిమా కథాంశం. పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో కూడిన కథలో నితిన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు.


Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?


ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' చేశారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, డైలాగ్స్: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: అనల్ అరసు


Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?