సమంత రూత్ ప్రభు స్టార్ పవర్ చూపించిన సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram). బాక్సాఫీస్ దగ్గర ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయయాత్రను కంటిన్యూ అవుతోంది. సెకెండ్ వీకెండ్ కూడా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అయితే... అనూహ్యంగా సోమవారం సమంత సినిమాకు షాక్ తగిలింది. కలెక్షన్స్ కిందకు పడ్డాయి. థియేటర్లలో విడుదలైన 11వ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? టోటల్ 11 రోజుల కలెక్షన్స్ ఎంత? అనేది తెలుసుకోండి. 

Continues below advertisement

బంగారానికి సోమవారం కోటిన్నర!Maa Inti Bangaram 11th Day Collection: 'మా ఇంటి బంగారం' విడుదలైన తర్వాత వారం తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. అఖిల్ అక్కినేని 'లెనిన్' వాయిదా పడటం సమంత సినిమాకు కలిసి వచ్చింది. దాంతో సెకండ్ వీకెండ్ ఈ సినిమాకు భారీ వసూళ్ళు వచ్చాయి. శుక్ర, శని, ఆది వారాల్లో వరుసగా 4.35, 4.90, 5.30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే సోమవారం సినిమా చతికిలపడింది.

Also Read: Akhil Raj Food Delivery Boy Viral Video - ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్

Continues below advertisement
  • 'మా ఇంటి బంగారం' సినిమాకు 11వ రోజున (రెండో సోమవారం) ఇండియాలో రూ. 1.60 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. 10వ రోజు (రెండో ఆదివారం) వచ్చిన కలెక్షన్స్ (రూ. 5.30 కోట్ల)తో పోలిస్తే... 69.8 శాతం తగ్గాయి.
  • రెండో సోమవారం కోటిన్నరకు పైగా నెట్ కలెక్షన్స్ రావడం అంటే... మంచి నంబరే. అయితే... ఆదివారంతో పోలిస్తే దారుణంగా పడింది.
  • 'మా ఇంటి బంగారం' సినిమాకు ఇండియాలో 11 రోజుల్లో రూ. 49.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
  • 'మా ఇంటి బంగారం' ఇండియా గ్రాస్ విషయానికి వస్తే... 11 రోజుల్లో రూ. 57.72 కోట్లు వచ్చాయి.
  • ఓవర్సీస్ మార్కెట్టులో రెండో సోమవారం (11వ రోజు) 30 లక్షల గ్రాస్ వచ్చింది. దాంతో 11 రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 23.15 కోట్లకు చేరింది.
  • ప్రపంచ వ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' 11 రోజుల గ్రాస్... 80.87 కోట్లు. 

Also ReadHaiwaan Release Date -'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో 50 కోట్ల క్లబ్బులోకి!ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మా ఇంటి బంగారం' ఇప్పటి వరకు రూ. 42.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మూడో వీకెండ్ అయ్యేసరికి 50 కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉంది. కర్ణాటకలో రూ. 8.86 కోట్లు, తమిళనాడులో రూ. 4.70 కోట్లు కలెక్ట్ చేసింది. 

'మా ఇంటి బంగారం' భారీ విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ మీట్‌లో 'మా ఇంటి బంగారం పార్ట్ 2' అనౌన్స్ చేశారు చిత్ర రచయిత, నిర్మాతలలో ఒకరైన రాజ్ నిడిమోరు. రాబోయే రెండేళ్లలో సీక్వెల్ రెడీ అవుతుందని, మొదటి భాగం కంటే డబుల్ ఫన్ & థ్రిల్ అందిస్తుందని తెలిపారు. 

Also Read: Niharika Love Story - 'ప్యారడైజ్' విలన్‌తో ప్రేమలో నిహారిక... సెల్ఫీతో నెట్టింట వైరల్