భారతీయ చిత్ర పరిశ్రమలోని లెజండరీ నటులలో దేవానంద్ ఒకరు. హీరోగానే కాకుండా రచయితగా దర్శకుడిగా నిర్మాతగా హిందీ సినీ ఇండస్ట్రీకి తన సేవలు అందించారు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణమైన నటనకు ప్రసిద్ధి చెందిన ఆయన కొన్నేళ్ల పాటు అగ్ర స్థానంలో బాలీవుడ్‌ ను ఏలారు. అతని స్టైల్, చార్మింగ్ పేస్, డైలాగ్ డెలివరీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేటికీ చాలా మంది దేవ్ స్వాగ్ ను అనుకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ముంబైలోని ఆయన ఇంటికి భారీ మొత్తానికి విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి.  


1950స్ నుండి 1970స్ ప్రారంభం వరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటులలో ఒకరిగా టాప్ లో నిలిచిన దేవానంద్, ముంబైలో ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. హిందీ చిత్రసీమలో తన సంపాదనలో చాలా వరకు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో దేవ్ ఒకరని అంటుంటారు. ఆయన తదనంతరం ఆస్తులన్నీ ఫ్యామిలీకి చెందాయి. ఆ ప్రాపర్టీలలో ముంబైలోని జుహులోని ఫేమస్ బంగ్లా కూడా ఉంది. దాన్ని రీసెంట్ గా ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ. 400 కోట్లకు అమ్మినట్లు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి.


ముంబై - జుహులోని దేవానంద్ ఇంటిని విక్రయిస్తునట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇప్ప‌టివ‌ర‌కూ డీల్ పూర్తి కాలేదు. అయితే తాజా క‌థ‌నాల‌ ప్రకారం ఆ డీల్ పూర్త‌యిందని, దేవ్ బంగ్లాకి కొత్త యజమాని దొరికాడని తెలుస్తోంది. మొత్తం 400 కోట్లకు డీల్ క్లోజ్ అయిందని, ఇప్పటికే దేవ్ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి డబ్బు జమా అయిందని అంటున్నారు. అంతేకాదు ఆ బంగ్లాని బహుళ అంతస్తుల టవర్‌ గా మార్చబోతున్నారని, పేపర్‌ వర్క్ పూర్తయిన తర్వాత పని ప్రారంభమవుతుంద‌ని నివేదికలు పేర్కొన్నాయి. 


Also Read: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు - ప్రోమోతో అదరగొట్టిన టైగర్ నాగేశ్వరరావు!


బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. దేవానంద్ ఇంటిని నాలుగు వందల కోట్ల రూపాయలకు ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసింది. ముంబై జుహూలో అత్యంత ఖ‌రీదైన‌ ఏరియా కావడంతో అన్ని కోట్ల ధర పలికిందని అంటున్నారు. కొత్త యజమాని ఆ బంగ్లా స్థానంలో 22 అంతస్తుల టవర్‌ ను నిర్మించాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. 


దేవానంద్ జుహులోని ఇంటిని 1950లో నిర్మించారు. దివంగత సూపర్‌ స్టార్ తన పూర్తి జీవితాన్ని భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ - దేవీనా ఆనంద్‌ లతో అక్కడే గడిపారు. ఇప్పుడంటే ఆ ఏరియా న‌గ‌రంలోని ఒక ప్రైమ్ లొకేష‌న్ గా మారింది కానీ, దేవ్ ఆ బంగ్లా కట్టినప్పుడు అదంతా ఒక అడవిలా ఉండేదని దేవ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జుహు అప్పట్లో చిన్న గ్రామం అని, అది ఎక్క‌డ ఉందో పెద్దగా ఎవ‌రికీ తెలియదని, మొత్తం అరణ్య ప్రాంతంలా ఉండేదని చెప్పారు. జుహూలో నివసించడం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అలాంటి దేవ్ కలల ఇంటిని భారీ మొత్తానికి విక్రయించారట. 


ఇటీవ‌ల దివంగత లెజండరీ నటుడు రాజ్ క‌పూర్ కు చెందిన ఖ‌రీదైన ఫిలిం స్టూడియో ఆర్కే ఫిలిం స్టూడియోని ప్ర‌ముఖ కార్పొరేట్ కంపెనీకి అమ్మడం హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు దేవానంద్ ఇంటిని నాలుగు వందల కోట్లకు అమ్మేశారని.. ఆ బంగ్లాని 22 అంతస్తుల పొడవైన టవర్ గా మార్చబోతున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


Also Read: 'జోరుగా హుషారుగా షికారు పోదమ' - కొత్త సినిమాతో వచ్చిన సంతోష్ శోభన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial