Leo OTT Release : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంస్థ 'లియో' ఓటీటీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 'లియో' మూవీకి ఏకంగా రెండు తేదీలను ప్రకటించడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. 'విక్రమ్' మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ తో తెరకెక్కించిన రెండవ చిత్రం 'లియో'. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్'(Master) మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా దసరా కానుకగా విడుదలైన 'లియో' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది.


లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన లియో అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.140 కోట్ల భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని కోలీవుడ్లో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే లియో ఓటీటీ రిలీజ్ కోసం తలపతి ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ రిలీజ్ కంటే ముందు ఆన్ లైన్ ఈ మూవీ లీక్ అవ్వడంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని, నవంబర్ 16 నుంచి ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.






కానీ నవంబర్ 16న 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాలేదు. దీంతో సినీ లవర్స్ నిరాశకు లోనయ్యారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా నెట్ ఫ్లిక్స్ 'లియో' ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటూ ఎవరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. అదేంటంటే, ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించింది. దాని ప్రకారం ఇండియాలో 'లియో'' నవంబర్ 24 న ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక గ్లోబల్ వైడ్ గా మాత్రం నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు అనౌన్స్ చేసింది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.


కాగా లియో ఓటీటీ రైట్స్ ని సుమారు రూ.120 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, అర్జున్, మడోనా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, శాండీ, మాథ్యూ ఇతర కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు.


Also Read : 'గూఢచారి' సీక్వెల్ లో హీరోయిన్ గా బనితా సంధు - లండన్ బ్యూటీతో అడివి శేష్ రొమాన్స్!