Latest Trends In Movies: హీరోయిన్లే అసలు విలన్లు... కొత్త సినిమాల్లో నయా ట్రెండ్... మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్‌లు
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ ట్రెండ్ ఏమిటో తెలుసా? హీరోయిన్లను విలన్స్ చేయడం. 'ఆర్ఎక్స్ 100'తో మొదలైన ఈ ట్రెండ్ లేటెస్ట్ 'కాంతార' వరకు కంటిన్యూ అయ్యింది.

సినిమా ఫీల్డ్ లో ఎప్పుడు ఏది ట్రెండిగా మారుతుందో చెప్పలేము. దాన్నే కొంతమంది సెంటిమెంట్ గా కూడా చెబుతారు. ప్రస్తుతం తెలుగు సినిమాల ధోరణి చూస్తుంటే హీరోయినే సినిమాకి మెయిన్ విలన్ అన్నట్టుగా కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇంతకు ముందు హీరోయిన్‌ను విలన్ గా చూపించాలి అంటే కచ్చితంగా సినిమాలో రెండో హీరోయిన్ ఉండేది. రజనీకాంత్ 'నరసింహ'ని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి రెండో హీరోయిన్ ప్రసక్తే లేకుండా డైరెక్ట్ గా మెయిన్ హీరోయిన్ నే విలన్ చేసేస్తున్నారు మన దర్శక రచయితలు. అలాంటి కొన్ని సినిమాల ఉదాహరణలు ఇక్కడ చూద్దాం.
Rx 100- పాయల్ రాజ్ పుత్ (2018)
హీరోయిన్లను విలన్ గా మార్చే రెండు పీక్ కి వెళ్లింది ఆర్ఎక్స్ 100తోనే అని చెప్పాలి. జస్ట్ తన కోరికలు తీర్చుకోవడం కోసం ప్రేమ పేరుతో శివ (కార్తికేయ)ని వాడుకుని చివరకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే కాకుండా హీరోని చంపించేసే కన్నింగ్ హీరోయిన్ గా ఇందు పాత్రలో పాయల్ రాజ్ పుత్ ని చూసి ప్రేక్షకులు షాక్ తిన్నారు. అంతవరకు టాలీవుడ్ లో అలాంటి హీరోయిన్ పాత్రను ఎవరూ ఊహించలేదు. శివ పాత్రలోని నిజాయితీతో కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా నుండి మెయిన్ హీరోయిన్ ని విలన్ గా మార్చేసే కొత్తవిలన్ గా మార్చేసే కొత్తరకం కథలను టాలీవుడ్ లో వండడం మొదలుపెట్టారు మేకర్స్.
విరూపాక్ష - సంయుక్త మీనన్ (2023)
అంత వరకూ 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్' లాంటి సినిమాల్లో సాత్విక పాత్రల్లో కనిపించిన సంయుక్త ఒక్కసారిగా తన తల్లిదండ్రుల చావుకు కారణమైన ఊరి ప్రజలను సర్వనాశనం చేసే మంత్రగత్తె నందిని పాత్రలో 'విరూపాక్ష'లో కనిపించి ఆడియన్స్ కు పెద్ద ట్విస్ట్ నే ఇచ్చింది. రిలీజ్ వరకూ హీరో సాయి దుర్గా తేజ్ సెంట్రిక్ మూవీ అనుకున్న ప్రేక్షకులకు ఈ సినిమాలో అసలు షాక్ ఇచ్చింది హీరోయిన్ సంయుక్తనే. సినిమా సూపర్ హిట్ కావడంలో హీరోయిన్ క్యారెక్టర్ పండించిన విలనీనే అసలు కారణం.
కింగ్ డమ్ - భాగ్య శ్రీ (2025)
సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో చాలా మంది నోటీస్ చేయని ఒక విలనీ పాత్ర 'కింగ్ డమ్'లో ఉంది. అదే డా. మధు పాత్రలో కనిపించిన భాగ్య శ్రీ. సినిమాలో తన అన్న శివ (సత్య దేవ్ )ను వెతుక్కుంటూ వచ్చిన సూరి (విజయ్ దేవర కొండ)కు అతని అన్నను చంపేస్తారని తెలిసినా ఆ విషయం అతనికి చెప్పకుండా దాచేసే ఒక విధమైన నెగిటివ్ క్యారెక్టర్లో భాగ్య శ్రీ కనిపిస్తారు. సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడంతో భాగ్యశ్రీ పాత్రలోని ట్విస్ట్ కూడా అంతగా పాపులర్ కాలేదు.
రచితా రామ్ - కూలీ (2025)
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో లేడీ విలన్ అంటే టక్కున గుర్తు వచ్చేది 'నరసింహ'లోని నీలాంబరి క్యారెక్టర్. కానీ ఆ పాత్రకు ఒక ఆరా ఉంటుంది. కానీ అదే రజనీకాంత్ సినిమా 'కూలీ'లో డబ్బు కోసం ద్రోహమే కాకుండా హత్యలు సైతం చేసే క్రూరమైన విలనీ పాత్రలో హీరోయిన్ రచితా రామ్ కనిపించారు. సినిమాలో మరో హీరోయిన్ శృతి హాసన్ ఉన్నప్పటికీ కథలోని అన్ని ట్విస్ట్ లకూ రచిత పోషించిన కళ్యాణి పాత్రనే కారణం అవుతుంది. ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్ హిట్ కాకపోయినా రచిత, ఆమె భర్త పాత్ర పోషించిన షౌబిన్ లకు మాత్రం చాలా పేరు వచ్చింది.
కాంతారా చాప్టర్ 1 - రుక్మిణీ వసంత్ (2025)
ఈ ఏడాది అతిపెద్ద పాన్ ఇండియా హిట్ అయిన 'కాంతారా 1'లో హీరో రిషబ్ శెట్టికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు హీరోయిన్ లా కనిపిస్తూ చివర్లో విలన్ గా ట్విస్ట్ ఇచ్చే యువరాణి కనకావతి పాత్ర పోషించిన రుక్మిణి వసంత్ కీ వచ్చింది. ఒకవైపు ముగ్ద మనోహరంగానే కనిపిస్తూ మరొక వైపు దుష్ట త్వాన్ని చూపే పాత్రలో రుక్మిణి నటన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఎంతెలా అంటే ఓవర్ నైట్ లో 'న్యూ నేషనల్ క్రష్'గా రుక్మిణికి కొత్త క్రేజ్ వచ్చేసేంతగా. ప్రస్తుతం ఈ సినిమా జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది.
ఒక్క 2025లోనే మూడు పెద్ద సినిమాల్లో హీరోయిన్లు విలన్లుగా కొత్త పాత్రాల్లో కనిపించారు. 'కింగ్ డమ్'లో భాగ్య శ్రీ, 'కూలీ'లో రచితా రామ్, 'కాంతారా 1'లో రుక్మిణి వసంత్ లు ఇలా హీరోయిన్ పాత్రకు కొత్త డైమన్షన్ తెచ్చారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాల్లో హీరోయిన్లే విలన్లుగా దర్శనం ఇస్తారో చూడాలి.
వీటన్నిటికీ మూలం ఆ సినిమానే.. హీరోయిన్ మన తెలుగుమ్మాయే
అయితే ఇలా హీరోయిన్ పాత్రే విలన్ గా ట్విస్ట్ ఇచ్చే కథనం మొదలైంది 2008లో వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం' సినిమాతోనే. ఆ సినిమాలో హీరోయిన్ గా కలర్స్ స్వాతి నటించింది. తను ప్రేమించిన వ్యక్తి (జై )నే కుటుంబ కలహాల నేపథ్యంలో చంపించేయడానికి సాయపడే తులసి పాత్రలో స్వాతి అప్పట్లోనే ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో 'అనంతపురం 1980' పేరుతో డబ్ చేస్తే ఇక్కడా బాగానే ఆడింది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'కొంటెచూపుతో... నీకొంటె చూపుతో...' సాంగ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాట చూసి మైమరచి పోయే ఇప్పటి ప్రేక్షకులు ఆ పాటలో కనిపించే హీరోనే స్వాతి పాత్ర చంపించేస్తుంది అని తెలియగానే షాక్ తింటారు. అప్పుడు మొదలైన ఈ ట్రెండ్ ప్రస్తుతం పీక్ కు వెళ్ళిపోయింది.
Also Read: 'బాహుబలి ది ఎపిక్' రివ్యూ: రెండు కాదు... ఒక్క సినిమాగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందంటే?





















